మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీముడి మరి సినిమాలను చేస్తున్నారు. సీనియర్లతో పాటు యంగ్ డైరెక్టర్లతో మూవీస్ ను చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత తను చేసిన సినిమాలను చూస్తే ఖైదీ నెంబర్ 150 మూవీని వివి వినాయక్ డైరెక్షన్లో చేయగా తర్వాత సైరాను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో, తర్వాత ఆచార్యను కొరటాల శివ డైరెక్షన్లో చేశారు.
ఇందులో ఖైదీ నంబర్ 150 మాత్రమే చిరు (Chiranjeevi) రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య మూవీ తో వింటే జ్ చిరును చూపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా లేవు. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన వశిష్ట (Vasishta) డైరెక్షన్లో విశ్వంబర మూవీని తీస్తున్నాడు. దాదాపు మూవీ షూటింగ్ కూడా కావొచ్చింది. మే లేదా జూన్ లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత సినిమా ఎవరి డైరెక్షన్లో ఉంటుందోనని చర్చ జరిగింది.
Chiranjeevi Movie : కామెడీ ఎంటర్టైనర్….
సంక్రాంతికి వస్తున్నాం (Sankrathiki vasthunnam) మూవీతో వెంకటేష్ (venkatesh) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి (Anil Ravipudi)డైరెక్షన్లో తన తరవాత మూవీని చేస్తున్న ట్టు తెలిసిందే. చాలా రోజుల తర్వాత చిరు పూర్తి కామెడీ మూవీని తీయబోతున్నాడు. చిరు కూడా ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నానని స్వయంగా చిరు చెప్పడం చూస్తే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఉగాది సందర్భంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
చిరునవ్వుల పండుగ..?
ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ లో కామెడీ మూవీ లతో కోట్లు కొల్లగొట్టే డైరెక్టర్ ఉన్నారంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. అతని డైరెక్షన్లో చిరు మూవీ తీయబోతున్నాడంటే మళ్లీ వింటే జ్ చిరుని పక్కగా చూడబోతున్నామని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు యాక్షన్ చెప్పగా విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టారు. రాఘవేంద్రరావు కూడా వేడుకలో పాల్గొన్నారు. ఈ మూవీకి చిరునవ్వుల పండుగ అనే ఒక క్రేజీ టైటిల్ ని కూడా అనుకున్నట్లు తెలుస్తోంది.చిరు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మూవీలో నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








