Sarkar Live

చిరు మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ కన్ఫామ్ – Chiranjeevi -Venkatesh Guest Role

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సర్‌ప్రైజ్ కాంబో Chiranjeevi – Venkatesh Guest Role | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ సెట్స్

Chiranjeevi

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సర్‌ప్రైజ్ కాంబో

Chiranjeevi – Venkatesh Guest Role | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ సెట్స్ పైకి వెళ్లి జెట్ స్పీడ్ లో షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ కి ముందు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తాడు. మూవీలో ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అదరగొట్టే అనిల్ రావిపూడి ప్రమోషన్ వీడియోస్ …

హీరోయిన్ నయనతారను (Nayanthara)కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. చిరు గ్యాంగ్ లీడర్ బాడీ లాంగ్వేజ్ ను చూడొచ్చని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు.70% కామెడీ,30% డ్రామా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ ల తోనే హిట్లు కొట్టే అనిల్ రావిపూడి ఈ మూవీని కూడా తన హిట్టు జానర్ నే సెలెక్ట్ చేసుకున్నాడు. మెగాస్టార్ కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదర గొట్టేస్తాడు.

వెంకీ గెస్ట్ అప్పియరెన్స్…

మెగాస్టార్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చేయక చాలా ఏళ్ళయిపోయింది. బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో రుచి చూపించడానికి రెడీ గా ఉన్నాడు. ఆ లెవల్లోనే మూవీ తెరకెక్కుతున్నట్టు కూడా మూవీ టీం నుండి టాక్ వినబడుతుంది.ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేస్తున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇన్ని రోజులు దీనిపై మూవీ టీం స్పందించలేదు. రీసెంట్ గా చిరు తో చేస్తున్న మూవీలో వెంకీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు.

Chiranjeevi – వెంకీ సీన్స్ తో నవ్వులు ఖాయం..

వెంకీ యంగ్ హీరోలతో చాలా మూవీసే చేశాడు. ఒక సీనియర్ టాప్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్.చిరు (Chiranjeevi ) వెంకీ కాంబోలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ను నవ్వులో ముంచెత్తడం ఖాయం అని ఇన్సైడ్ టాక్. త్వరలోనే వెంకీ సెట్స్ లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?