ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అంటే చిరు – అనిల్ రావిపూడి దే (Chiru- Anil ravipudi). ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ పకడ్బందీగా చేసుకుని సెట్స్ పైకి వెళ్తారు. ఏప్రిల్ లో కొబ్బరికాయ కొట్టనున్నట్లు ఫిలిం నగర్ టాక్. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీ విన్టేజ్ చిరును గుర్తుకుతెచ్చేలా ఉంటుందంటున్నారు. ఇప్పటికే చిరు లీక్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల అనిల్ రావిపూడి వెంకటేష్ (Anil Ravipudi – Venkatesh) కాంబో లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి 300 కోట్లు కొల్లగొట్టింది.వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా మూవీ నిలిచింది. అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా మరిచిపోలేని మూవీగా ఉండిపోతుంది. క్రిన్జీ కామెడీ అని కొందరు అన్న కూడా ఆడియన్స్ మూవీని బిగ్గెస్ట్ హిట్టు చేశారు.మూవీ తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన భారీ లాభాలు తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్ లు అందరూ కలిసి సక్సెస్ మీట్ పెట్టారంటే ఎంత లాభం చూసారో అర్థం చేసుకోవచ్చు.
విశ్వంభర బడ్జెట్ 300 కోట్ల పైనే..?
ఇప్పుడు చిరు విశ్వంభర సెట్స్ మీద ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ అయిపోయినట్టే. లేటెస్ట్ గా చిరుపై ఇంట్రడక్షన్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మెరవబోతున్నాడట.దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తీస్తున్నట్టు టాక్. చిరు రీ ఎంట్రీ తర్వాత ఆరు సినిమాలు తీస్తే అందులో వాల్తేరు వీరయ్య, ఖైదీ నంబర్ 150 మాత్రమే హిట్టయ్యాయి.మిగితా నాలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్, యావరేజ్ లే. ఒకప్పుడు చిరు మీద ఎంత బడ్జెట్ పెట్టిన అంతకు పదింతలు వసూళ్లు చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకు చిరు తీసిన గత చిత్రాలే నిదర్శనం.ఇప్పుడు బాక్సాఫీసు కు మెగాస్టార్ సత్తా ఎంటో విశ్వంభర తో చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం 500 కోట్ల కు పైగా వసూళ్లు చేసే సత్తా మెగాస్టార్ కి ఉంది. కానీ నెగెటివ్ టాక్ వస్తె మాత్రం అంతే సంగతి .
Chiru- Anil ravipudi : రెమ్యూనరేషన్ రూ.100 కోట్లు..
చిరు – అనిల్ రావిపూడి (Anil ravipudi ) కాంబో మూవీ పై కూడా అందరికీ బడ్జెట్ మీదే డౌట్ ఉంది. చిరు ఈ మూవీకి రెమ్యునరేషన్ 75 కోట్లు తీసుకుంటున్నారని ఒక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే మూవీ డేంజర్ జోన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్టు తర్వాత అనిల్ రావిపూడి 25 కోట్లు తీసుకుంటున్నారని తెలిసింది. వీరిద్దరి రెమ్యూనరేషన్ లే 100 కోట్లు అయితే మిగితా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరివి కలుపుకుంటే ఈజీ గా 200 కోట్లలో పడుతుంది. సరే క్రేజీ కాంబినేషన్ పై ఇంత బడ్జెట్ పెట్టీ మూవీ తీస్తే అంతకు అంత తిరిగి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. మూవీ పాజిటివ్ టాక్ వస్తె మాత్రం పెట్టింది తిరిగి రావచ్చు.ఇంకా సూపర్ హిట్టు టాక్ వస్తె లాభాలు చూడొచ్చు. నెగిటివ్ టాక్ వస్తె భరించలేని నష్టాలను కూడా చూడాల్సి వస్తుందనేది ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇలా చిరు అనిల్ రావిపూడి కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్ళకు ముందే బడ్జెట్ పై రకరకాలుగా చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








