Christmas Special Trains : క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాలను సందర్శిస్తారు. తమిళనాడులో గల విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి భారీగా సందర్శకులు వస్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్కడికి వచ్చే క్రైస్తవులు ఎంతో ఇష్టపడతారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జనాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘనంగా జరుగుతాయి.
క్రిస్మస్ (Christmas) సందర్భంగా ప్రత్యేక రైళ్లు..
- రైలు నెం. 17653 రామనాథపురం స్పెషల్ ట్రైన్ ఈనెల 18, 2024న రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయి మరుసటి రోజు మధ్యాహ్నం 1:55 గంటలకు విల్లుపురం చేరుతుంది.
- రైలు నెం. 17653 Puducherry Express ఈనెల 18, 2024న సాయంత్రం 5 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:05 గంటలకు విల్లుపురం స్టేషన్‌కు చేరుకుంటుంది.
- రైలు నెం. 17653 Puducherry Express ఈనెల 22, 2024న సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:05 గంటలకు విల్లుపురం స్టేషన్‌కు చేరుకుంటుంది.
- రైలు నెం. 09520 Madurai Special Fare Special ఈనెల 18, 2024న ఉదయం 8.31 గంటలకు మల్కాజిగిరి జంక్షన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 04:40 గంటలకు విల్లుపురం స్టేషన్‌కు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్ ఫేర్ స్పెషల్ ట్రైన్ : ఈ రైలు ఈనెల 22, 29వ తేదీల్లో సేవలందిస్తుంది.
- సికింద్రాబాద్-బ్రహ్మాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు: ఈ వీక్లీ స్పెషల్ రైలు డిసెంబర్ 20, 27వ తేదీల్లో ప్రయాణికులకు సేవలందిస్తుంది.
- బ్రహ్మపూర్-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు: ఈ వీక్లీ స్పెషల్ రైలు ఈనెల 21, 28వ తేదీల్లో నడుస్తుంది. మీరు ఈ ప్రత్యేక రైళ్ల కోసం
- భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో వివరాలను తెలుసుకుని బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు”