CISF Jobs Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి.
CISF Jobs Notification ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం : 2025 ఫిబ్రవరి 3 |
దరఖాస్తు ముగింపు : 2025 మార్చి 4 (11:59 PM)|
(ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభమవుతుంది)
అర్హతలు
- విద్యార్హత : అభ్యర్థులు మాట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.
సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు, ఇతర బోర్డులు జారీ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. - డ్రైవింగ్ లైసెన్స్ : హెవీ మోటార్ వెహికిల్స్ (HMV), లైట్ మోటార్ వెహికిల్స్ (LMV), గేర్‌తో మోటార్ సైకిల్‌కు చెల్లుబాటయ్యే లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం అవసరం. వయోపరిమితి
- అభ్యర్థుల వయసు 21 నుంచి 27 సంవత్సరాల (2025 మార్చి 4 నాటికి) మధ్య ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
- మాజీ సైనికులకు ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపు ఉంటుంది. ప్రత్యేక సడలింపులు
- 1984 అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితుల పిల్లలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు
- జనరల్, EWS, OBC అభ్యర్థులకు : రూ. 100
- SC/ST, మాజీ సైనికులకు: పూర్తి మినహాయింపు. చెల్లింపు విధానం ఆన్‌లైన్ (UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా) లేదా ఆఫ్‌లైన్‌లో SBI చలాన్ జనరేట్ చేసి చివరి తేదీ కంటే ముందుగా చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ
శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాలు (PST)
- అభ్యర్థుల శారీరక దారుఢ్యం 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్ ద్వారా పరీక్షిస్తారు.
- అభ్యర్థుల ఎత్తు, ఛాతీ, బరువును కొలుస్తారు.
- కొన్ని కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపులు ఉంటాయి.
డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్
- విద్యార్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు ధృవీకరిస్తారు.
- ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.
రాత పరీక్ష
- 100 ప్రశ్నల రాత పరీక్ష ఐదు విభాగాలుగా ఉంటుంది:
- జనరల్ నాలెడ్జ్
- గణితం
- విశ్లేషణాత్మక మేధస్సు
- పరిశీలనా సామర్థ్యం
- హిందీ/ఆంగ్ల భాషా పరిజ్ఞానం
వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా
మెడికల్ టెస్టు ఓకే అయితేనే అభ్యర్థులు మెరిట్ జాబితాలో స్థానం పొందుతారు. దరఖాస్తు విధానం
- CISF Website : అధికారిక వెబ్‌సైట్ (cisfrectt.cisf.gov.in) కు వెళ్లండి.
- చెల్లుబాటు అయ్యే ఈ-మెయిల్ ID, ఫోన్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ అవ్వండి.
- వ్యక్తిగత, విద్య సంబంధిత, సంప్రదింపు వివరాలతో దరఖాస్తు ఫారం పూరించండి.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయండి.
- ఆన్‌లైన్ ఫీజు చెల్లించండి లేదా SBI చలాన్ జనరేట్ చేయండి.
- దరఖాస్తును పూర్తిగా మరోసారి పరిశీలించాకే సమర్పించండి.
- దరఖాస్తు ఫారాన్ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..