- పౌరసరఫరాల శాఖలో అవినీతి అధికారి
- ముడుపుల కోసం మిల్లర్ లను వేధిస్తున్నట్లు ఆరోపణలు
- మిల్లర్లు నోరు విప్పితే మేడంపై వేటు పడే అవకాశం
Civil Supplies Corruption | ఆ మేడం సంతకం చాలా కాస్ట్లీ గా ఉంటుందట.. ఆమె పెట్టే ఒక్కో సంతకానికి ఒక్కో రేటు చెల్లించాల్సిందేనని రైస్ మిల్లర్ లు బాహాటంగానే మేడం లంచాల బాగోతంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు చెల్లిస్తే ఒకలా, చెల్లించకపోతే మరోలా ఆమె వ్యవహారశైలి ఉంటుందని చేయి తడిపితే తప్ప ఫైలు కదలట్లేదని విశ్వసనీయ సమాచారం.
వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ (Civil Supplies Hanamkonda) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆ మేడం ప్రతీ సంతకానికి ఫైళ్ల వారీగా వసూళ్లకు పాల్పడుతూ కార్యాలయంలో “కాసుల రాణి”గా అవతరించిందని తెలుస్తోంది. ఆమె పెట్టే ఒక్కో సంతకం విలువ అక్షరాల రూ.5,000 వరకు ఉంటుందంటే ఆ అధికారి ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు. మిల్లర్ల వద్ద నుంచి నేరుగా ఆ కార్యాలయంలోనే వసూళ్లకు పాల్పడుతుందంటే ఆమెకు ఉన్నతాధికారులు ఆశీస్సులు ఉండే ఉంటాయని ప్రచారం లేకపోలేదు.
ఈ మేడం పేరుతో కార్యాలయంలో “కాసుల రాణి” అనే పేరు ప్రచారంలో ఉంది. పౌరసరఫరాల శాఖలోని ఓపిఎంఎస్ (OPMS) నుండి ఆర్వో (RO)ల వరకు అన్ని ప్రక్రియలలో ఆమె సంతకం కీలకం కావడం, దీనికి భారీగా లంచాలు డిమాండ్ చేయడం మిల్లర్లకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
Civil Supplies : మిల్లర్ నోరువిప్పితే మేడంపై వేటే?
హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం ((Civil Supplies Office)) లో చక్రం తిప్పుతూ మిల్లర్ ల వద్ద నుండి వసూళ్లకు పాల్పడుతూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మేడం లంచాల భాగోతంపై జిల్లాలోని మిల్లర్లు కనుక నోరువిప్పితే ఆ మహిళా అధికారిపై వేటు తప్పదని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపిఎంఎస్ నుండి ఆర్వో ల వరకు ప్రతి ఫైలుకు ఆ మేడంకు రూ.5 వేలు చెల్లించాల్సిందేనని లేదంటే తమ ఫైళ్లు కదలనివ్వట్లేదని మధ్యతరహా మిల్లర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి పై జిల్లా అడిషనల్ కలెక్టర్ స్పందించి మేడం వసూళ్లపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది మిల్లర్లు కోరుతున్నారు. మరి ఈ వసూళ్ల భాగోతంపై అడిషనల్ కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.