CM Revanth Reddy On Benefit shows | హైదరాబాద్: ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం అలాంటి బెనిఫిట్ ఫోలకు అనుమతించబోదని, తెలుగు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించారు.
బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో గురువారం జరిగిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, నటులు నాగార్జున, వెంకటేష్, సినీ నిర్మాతలు కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, హరీష్ శంకర్, తదితర ప్రముఖులతో సహా 36 మంది పరిశ్రమ పెద్దలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున సమావేశానికి దిల్ రాజు పాల్గొన్నారు. కాగా , తొక్కిసలాట విషాదం తర్వాత చిత్ర పరిశ్రమలో వివిధ ఆందోళనలు జరిగాయని ధృవీకరించారు. ఇకపై బెనిఫిట్ షోలను అనుమతించబోమని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Benefit shows సెలబ్రిటీలు తమ అభిమానులకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ప్రమోషన్స్ సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్‌లో సినిమా పరిశ్రమ ఎక్కువ బాధ్యత తీసుకుంటేనే ప్రభుత్వం తగిన సపోర్ట్ ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషాద ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
సినీ ప్రముఖల స్పందన ఇదే..
కాగా టాలీవుడ్ భవిష్యత్తుపై సినీ పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రముఖ చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు ప్రభుత్వ చర్యకు తన మద్దతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TSFDC) ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకాన్ని స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. నటుడు నాగార్జున హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి స్టూడియో సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదించారు. తద్వారా చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేస్తుందని తెలిపారు. సినీ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ ఈ పోటీ వాతావరణంలో పెరుగుతున్న ప్రమోషన్ల ప్రాముఖ్యత గురించి మురళీ మోహన్ చర్చించారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈవెంట్‌లలో మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని వివరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] ఆయన అదనంగా LPSC-IPRC కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కౌన్సిల్ […]