Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయన నివాసంలో సీఎం సోమవారం కలిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
శాంతి చర్చలపై సమాలోచన
కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పీస్ టాక్స్ (Peace Talks Committee) కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌ను కోరారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) నేపథ్యంలో తక్షణ సీజ్‌ఫైర్ ప్రకటించాలని కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ తదితరులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గతంలో మావోయిస్టుల (Maoists)తో చర్చలు నిర్వహించిన అనుభవజ్ఞుడైన కె. జనారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. సీజ్‌ఫైర్, శాంతి చర్చలపై సమాలోచన చేశారు.
Peace Talks : రాష్ట్ర కేబినెట్‌లో చర్చించేందుకు సిద్ధం
నక్సలిజాన్ని చట్టపరమైన సమస్య కాకుండా సామాజిక కోణంలో చూస్తున్నామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని (Union government) మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించేందుకు ఒప్పించే దిశగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో నక్సలిజం సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
సామాజిక సమస్యగా నక్సలిజం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో పీస్ టాక్స్ కమిటీ (Peace Talks Committee) సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ (Operation Kagar)ను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని కమిటీ సభ్యులు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని (Union government) ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని స్పష్టం చేశారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన మాజీ హోం మంత్రి కె. జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి అన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మావోయిస్టు సమస్యను లేవనెత్తారు. నిన్న ఎల్కతూర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మావోయిస్టులపై కొనసాగుతున్న ‘ఆపరేషన్ కాగర్’ను తక్షణం నిలిపివేసి, శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు .ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం తదుపరి సమావేశంలో మావోయిస్టుల అంశంపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకోనుందని పీస్ టాక్స్ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు . ఈ నేపథ్యంలోనే మాజీ హోం మంత్రి జానారెడ్డిని కలిశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    