CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాలకు పయనమయ్యారు. తన సహచర మంత్రులతో కలిసి సింగపూర్, దావోస్ పర్యటనకు బయల్దేరారు. ముందుగా ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సింగపూర్ (Singapore)లో సాగింది. ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్ (Vivian Balakrishnan)ను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు, పర్యాటక రంగ అభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధికి పెట్టుబడులు, వనరులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
విస్తృత చర్చలు జరిపాం: సీఎం రేవంత్
సింగపూర్ విదేశాంగ మంత్రి (Foreign Affairs Minister of Singapore) వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఐటీ, పర్యాటకం, నీటి నిర్వహణ వంటి విభాగాల్లో సహకారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతా (@revanth_anumula) ద్వారా వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్‌తో విస్తృత చర్చలు జరిపామని, ఆయన అంతర్ దృష్టి చాలా గొప్పదని రేవంత్ కొనియాడారు. తమ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఒప్పందాలు జరిగాయని సీఎం ట్వీట్ సారాంశం.
CM Revanth Reddy : దావోస్ పర్యటన
సింగపూర్ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy singapor Tour )తన మంత్రివర్గ సహచరుడు డి.శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులతో కలిసి స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos)కు బయల్దేరుతారు. జనవరి 20 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణకు పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు చర్చలు జరపనున్నారు.
తెలంగాణ అభివృద్ధికి కసరత్తు!
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయిలో నిలిపేందుకు తాము పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి కొత్త మార్గాలు తెరవనుందని ఆయన మంత్రి వర్గ సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం
సింగపూర్ పర్యటన తెలంగాణ అభివృద్ధికి ప్రధాన మైలురాయి అవుతుందని అంటున్నారు. విదేశీ మంత్రులతో చర్చలు, ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్ర ప్రతిభను ప్రదర్శించడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం మరింత మెరుగుపడుతుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








