Tradition of Rooster Fights : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి రంగురంగుల ముగ్గులు, పతంగులు ఆ తరువాత కోడి పందేలు.. అయితే ఆంధ్రప్రదేశ్ (Cock Fights in Andhra Pradesh) లోని గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు జరుగుతుంటాయి. ఈ పందాలను (rooster fights )ఏపీ సర్కారు నిషేధించినప్పటికీ ఎక్కడ చూసినా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా జన సమూహా మధ్య ఈ జూదం సంస్కృతి ఏటా విస్తరిస్తూనే ఉంది.
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని సీసాలి, పెద అమిరం, ఆకివీడు, మహదేవపట్నం, దుగ్గిరాలతో సహా పలు ప్రాంతాల్లో ‘బారీలు (Baris), లేదా కోడిపందాలు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల కొద్దీ పందేలు కాస్తుంటారు. కొందరు పందెం రాయుళ్లు ఎలాగైనా గెలిచితీరాలన్న కసిదో కోడి కాళ్లపై రేజర్‌లు అమర్చుతుంటారు.
బహుమతులుగా సైకిళ్ల నుంచి లక్షల విలువైన కార్లు
మోటార్‌సైకిళ్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లు, SUVలు వంటి భారీ బహుమతులతో నిర్వాహకులు ఈ పందాలకు కొత్త ఉత్సాహాన్ని జోడించారు. కాకినాడ జిల్లాలోని పెనుగుదురు గ్రామంలో విజేతకు మహీంద్రా థార్ SUV బహుమతిగా ప్రకటించారు. గుడివాడలోని కొన్ని రంగస్థలాలు ప్రతిరోజూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను అందజేస్తున్నాయి. చిన్న ఈవెంట్లలో గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, సైకిళ్లు వంటి బహుమతులను అందిస్తున్నాయి.
Cock Fights : క్యాసినోలను తలదన్నేలా..
కోడిపందాలు క్యాసినో తరహాలో గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు సర్వసాధారణమైపోయాయి. ప్రవేశ రుసుము రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఈ వేదికల వద్ద తాత్కాలిక మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలు జాతరను తలపిస్తుంటాయి. ఫ్లడ్‌లైట్లు, LED స్క్రీన్‌లు, అరేనా స్టైల్ సీటింగ్‌లతో సహా భారీ సెటప్‌లు ఈ ఈవెంట్‌లను గొప్ప దృశ్యాలుగా మార్చాయి.ఈ కోడిపందేలను చూడడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుండి పెద్ద ఎత్తున వీక్షకులు వస్తుంటారు.
చట్టం ఏం చెబుతోంది..?
జంతువులపై హింసను నిరోధించే చట్టం, 1960 (The Prevention of Cruelty to Animals Act, 1960) , జంతువుల పోరాటాలు సంబంధిత కార్యకలాపాలను నిషేధిస్తుంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత సంవత్సరం ఈ నిషేధాన్ని పునరుద్ఘాటించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని జిల్లా అధికారులను నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ, కోడిపందాలు ఈ ప్రాంతంలో లాభదాయకమైన క్రీడగా, సాంస్కృతికపరమైన అంశంగా బలంగా నాటుకుపోయింది. పందెం కోళ్ల ( Fighting roosters) కు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు విక్రయిస్తున్నారు, సంక్రాంతికి ముందు కొన్ని వారాలకు ముందు ఈ ధరలు ఆకాశాన్నంటుతాయి.
కాక్‌ఫైటింగ్(cockfights) సందర్భంగా అక్రమ మద్యం అమ్మకాలు, అక్రమ జూదంతో సహా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వేదికగా మారిపోతాయి. అధిక-విలువైన బహుమతులు, హంగు ఆర్బాటాలతో సెటప్‌లు జంతువులపై క్రూరత్వం సర్వసాధాణమై పోయాయని విమర్శకులు చెబతున్నారు. సంక్రాంతి సంబరాలు సాగుతున్న తరుణంలో ఈ సమస్యలను పరిష్కరించి చట్టబద్ధత పాటించాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..