Cold wave : తెలంగాణలో చలి తీవ్రంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాద్, భీంపూర్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే విధంగా పోచార, భోరాజ్, తండ్రా ప్రాంతాల్లో 6.4 నుంచి 6.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6.3 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రతంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ (Cold wave )
Cold wave in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూడా చలితీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా, రంగారెడ్డి జిల్లాలోని సీరిలింగంపల్లి మండలంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిసరాల్లో 9.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మౌలాలీ ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి ప్రాంతాల్లో 11.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఉంది. నగర పరిసర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రంగా ఉంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ ప్రాంతంలో 11.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా షాద్‌నగర్ ప్రాంతంలో 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఉంది. కాప్రా మునిసిపాలిటీ ప్రాంతంలో 12.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
జాగత్రలు అవసరం
Precautions | హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా రాత్రిపూట మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా జైనాద్, భీంపూర్, పోచార, భోరాజ్ వంటి ప్రాంతాల్లో నమోదైన తక్కువ ఉష్ణోగ్రతలు చలి తీవ్రతను సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








