Coolie movie review : సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కూలీ. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సెట్స్ పై ఉన్నప్పటి నుండే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లోకేష్ రజినీ కాంబో బాక్సాఫీస్ దండయాత్ర ఖాయమనే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం….
స్టోరీ…
దేవా, రాజశేఖర్(రజినీకాంత్ , సత్యరాజ్)ఇద్దరు స్నేహితులు. రాజశేఖర్ కొన్ని పరిస్థితుల వల్ల చనిపోతాడు. అది సహజ మరణం కాదు కొందరు హత్య చేశారనే విషయం దేవా కి తెలుస్తుంది.అసలు రాజశేఖర్ ని హత్య చేసింది ఎవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇది తెలుసుకున్న దేవా ప్రతీకారం తీర్చుకున్నాడా..?అసలు సైమన్ (నాగార్జున)అనే వ్యక్తి ఎవరు..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే….
మూవీ ఎలా ఉందంటే…
ముందుగా చెప్పినట్టు ఇది లోకేష్ యూనివర్సల్ మూవీ కాదు.ఈ మూవీ 100 భాషా సినిమాలతో సమానం అని కింగ్ నాగార్జున పెద్ద స్టేట్మెంటె ఇచ్చాడు. కానీ అంతగా లోకేష్ కనకరాజు స్టోరీని నడిపించలేదనిపించింది. ఫస్టాప్ లో కథపై పట్టు విడవకుండా తీసినా సెకండాఫ్ కి వచ్చేసరికి ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యే విధంగా ఉంది (Coolie movie review ) . స్లో నరేషన్ తో మూవీని సాగదీసాడు. రజినీ స్టైల్ స్వాగ్ అలరించేలా ఉంది.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ టెర్రిఫిక్ గా వచ్చాయని చెప్పొచ్చు. రజినీ ఆ సీన్స్ లో అదరగొట్టాడు. అయితే ఎక్కువ మంది టాప్ యాక్టర్స్ ఉండడం కూడా మూవీకి మైనస్ అయిందని చెప్పొచ్చు. కొన్ని కొన్ని సీన్లు మాత్రం ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా తీశాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా లోకేష్ కనుకరాజ్ ఈ మూవీతో జస్ట్ ఒకే అనిపించాడు.
నటీ నటులు సాంకేతిక నిపుణుల పనితీరు..
లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని సంచలనమే.ఒక్కొక్క మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఇక రజినీకాంత్ మూవీ అంటే ఇంకెలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఊహించుకున్నారు.వారి అంచనాలను అందుకోవడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.మూవీని బాగానే తీసినా ఇంకాస్త బెటర్ గా తీసుంటే బాక్సాఫీస్ బద్దలయ్యేది. ఇక రజినీ ఎప్పటిలాగే తన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. తన స్వాగ్ తో అలరించాడు.మూవీలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది కింగ్ నాగార్జున గురించే. ఫస్ట్ టైమ్ విలన్ గా యాక్ట్ చేస్తుండడంతో ఎలా చేసుంటాడో అని ఈగర్లీ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి నిరాశే అని చెప్పొచ్చు. స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉన్న పాత్రలో నటించడం.. అందులో అంతలా విలనిజం పండలేదని చెప్పొచ్చు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఆ రోల్ ని పవర్ ఫుల్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఉపేంద్ర ఎంట్రీ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అమీర్ క్యామియో రోల్ బాగుంటుంది.సత్యరాజ్, సౌబిన్ షాహీర్, శృతి హసన్ ఇంకా మిగతా నటీ నటులు వారి వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు.అనిరుధ్ బీజీఎం కొన్ని కొన్ని సీన్లను బాగానే ఎలివేట్ చేసింది.రజినీ స్వాగ్ కి అనిరుధ్ మ్యూజిక్ మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక పాటలు మూవీ రిలీజ్ కి ముందు రెస్పాన్స్ ఎలా వచ్చిందో మనకు తెలిసిందే. మోనిక సాంగ్ వచ్చినప్పుడు తెగ ఎంజాయ్ చేస్తారు.నిర్మాణ విలువలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది.
నటీ నటుల పనితీరు
- రజినీకాంత్ – తన స్వాగ్, ఎనర్జీతో దంచేశాడు.
- నాగార్జున – విలన్ రోల్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా, స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండడం వల్ల ఇంపాక్ట్ తగ్గింది.
- ఉపేంద్ర – ఎంట్రీకి సూపర్ రెస్పాన్స్.
- సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు తమ పాత్రల మేరకు బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్
- రజినీ యాక్టింగ్
- క్లైమాక్స్
- బీజీఎం
మైనస్ పాయింట్స్..
- సెకండాఫ్ లో సాగదీత సీన్లు
- రేటింగ్
3.5/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








