Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది.
రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు:
- కేరళ – 1,487 కేసులు
- ఢిల్లీ – 562 కేసులు
- పశ్చిమ బెంగాల్ – 538 కేసులు
- మహారాష్ట్ర – 526 కేసులు
- గుజరాత్ – 508 కేసులు
- కర్ణాటక – 436 కేసులు
- తమిళనాడు – 213 కేసులు
Corona Virus : పెరుగుతున్న మరణాలు..
గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో ఒక చిన్నారి సహా ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. దీంతో 2025లో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. కాగా, ఇప్పటివరకు 3,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రజలకు సూచన:
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వినియోగం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.