ఏ ఫైలు కదలాలన్నా.. మేడం చేయి తడపాల్సిందేనట..?
Corruption in Civil Supplies Department | రాజుల కాలంలో రాజ్యానికి రాణులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ కార్యాలయానికి కూడా ఓ రాణి ఉందంటే అతిశయోక్తి కాదట. రాణి అంటే మహారాణి కాదు “కాసుల రాణి”. ఓ మహిళా అధికారి ఆ కార్యాలయాన్నే తన సామ్రాజ్యంగా ఫీల్ అవుతూ తనకు తాను ఆ కార్యాలయానికే “రాణి “లా ఊహించుకుంటూ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె రాచరిక పోకడలు, మిల్లర్ పట్ల ఆమె ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే రాజుల కాలం గుర్తొస్తుందని కొంతమంది మిల్లర్ బహిరంగంగానే ఆ అధికారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.హన్మకొండ పౌరసరఫరాల శాఖలో ఏ ఫైలు కదలాలన్న,ఆ ఫైలు మీద ఆమె సంతకం చేయాలన్న మేడం ను కలవాల్సిందేనట,కలుసుడంటే అలా ఇలా కలుసుడు కాదు కాసులతో కలిస్తేనే వాళ్ళ ఫైళ్లు కదులుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.
Civil Supplies | ఫైలు కదలాలంటే.. ముడుపులు తప్పవు?
హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారి లంచాల భాగోతం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.ఆమె డిమాండ్ చేస్తున్న తీరుపై మిల్లర్ లు అసహనంగా ఉన్నట్లు సమాచారం.” ఓపిఎంఎస్ “మొదలుకొని “ఆర్వో” ల వరకు ప్రతీ పనికి సంబంధించిన ఫైలు క్లియరెన్స్ కావాలంటే ఆమె అడిగినంత ముట్టజెప్పాల్సిందేనని,లేదంటే ఫైలుపై సంతకం పెట్టకుండా నానా కొర్రీలు పెట్టి కాళ్లరిగేలా ఆఫీస్ చుట్టూ తిప్పిస్తోందని కొంతమంది మిల్లర్ ఆమె వసూళ్ల విధానం పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో చక్రం తిప్పుతున్న మేడం ఇప్పటికే మిల్లర్ ల నుండి అందినకాడికి దండుకుంటూ బాగానే వెనకేసినట్లు కార్యాలయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా “అవినీతి నిరోధక శాఖ” దూకుడు తో లంచగొండి ఆఫీసర్ లు గజగజ వణికిపోతూ లంచాలు తీసుకునే రూటునే ఎప్పటికప్పుడు మారుస్తుంటే..ఈ అధికారి మాత్రం నేరుగా కార్యాలయంలోనే మిల్లర్ వద్ద నుండి వసూళ్లకు పాల్పడడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.