- హరిరామ్ కంటే ఆ రిటైర్డ్ “ఎస్ఈ “అక్రమాస్తులే ఎక్కువంటూ నీటి పారుదల శాఖలో ప్రచారం?
- హరిరామ్ ఎపిసోడ్ తో రిటైర్డ్ ఎస్ఈ “సుధాకరుడి” అక్రమాలపై చింతగట్టు కార్యాలయంలో జోరుగా చర్చ ..
- రిటైర్డ్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సార్తిస్తే విస్తుపోయే అక్రమాస్తులు బయటపడే చాన్స్?
Corruption in Irrigation Department | “హరిరామ్ ” ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం( Telangana)లో మారుమోగుతోంది. 4 రోజుల క్రితం వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ (Irrigation Department) మినహా ఎవరికీ ఎక్కువ తెలియని ఈయన పేరు తాజాగా ఏసీబీ రైడ్ తో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్న ఈ అధికారి అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తనిఖీలు చేయడంతో సుమారుగా రూ.200 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు బయటపడినట్లు బహిరంగంగా ప్రచారం జరిగింది. అయితే ఇదే శాఖలో ఈయనకు మించి బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టిన మరో ఘనుడు కూడా ఉన్నాడని ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District )లోని ఇరిగేషన్ కార్యాలయాల్లో (Irrigation Office) జోరుగా చర్చ సాగుతోంది.కానీ ఆ అధికారి ఈ మధ్యకాలంలోనే పదవీ విరమణ పొంది ఏసీబీ దాడుల( ACB Raids) నుండి తప్పించుకొని ఊపిరిపీల్చుకున్నాడని నీటిపారుదలశాఖ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Irrigation Department : హరిరామ్ ను మించిన ఘనుడేనా..?
నీటి పారుదల శాఖ (Irrigation Department) లో “ఈ ఎన్సీ” గా విధులు నిర్వహిస్తున్న హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లో కీలక భూమిక పోషించినట్లు సమాచారం.సదరు అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు (ACB Raids) చేయగా ఆదాయానికి మించి 2 వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్ (Bank Lockers) లను కూడా ఇంకా తెరవలేదని, హరిరామ్ కు సంబంధించిన లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని సమాచారం.అయితే “ఈ ఎన్సీ” హరిరామ్ (Hariram) పై ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మరో అధికారి అక్రమాస్తులపై చర్చ జరగడం నీటి పారుదల శాఖ లో చర్చనీయాంశంగా మారిందట. ఇరిగేషన్ శాఖలో “సి ఈ” &”ఎస్ ఈ” గా విధులు నిర్వహించి కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన “సుధాకరుడు” బినామీల పేరుతో భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు హన్మకొండ జిల్లాలోని చింతగట్టు ఇరిగేషన్ కార్యాలయంలో రెండురోజుల నుంచి ప్రచారం కావడం గమనార్హం.
“ఏసీబీ(ACB)” సైతం విస్తుపోవాల్సిందేనట..?
నీటి పారుదల శాఖలో “ఏ ఈ “గా మొదలైన సుధాకరుడి ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంచార్జి “సి ఈ” గా ముగిసినట్లు తెలుస్తోంది. సాధారణ కుటుంబానికి చెందిన సదరు అధికారి తాను “AE” గా బాధ్యతలు స్వీకరించినప్పుడు 2 ఎకరాలతో మొదలైన తన ఆస్తుల వ్యవహారం ఆయన హోదా పెరిగే కొద్దీ వందల ఎకరాలుగా మారినట్లు సమాచారం.అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad) తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు సైతం తన బినామీ పేర్లపై ఉంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి .4 రోజుల క్రితం ఏసీబీ దాడులతో ఇరిగేషన్ శాఖలో (Irrigation Department) ఫేమస్ అయిన హరిరామ్ (Hariram) కంటే కూడా ఈ సుధాకరుడు అక్రమాస్తుల్లో ఆరితేరిపోయినట్లు మాతృశాఖలో ప్రచారం. రిటైర్డ్ అయిన “ఎస్ ఈ” సుధాకరుడిపై కనుక ఏసీబీ అధికారులు దృష్టి సారించి విచారణ చేస్తే వారు సైతం విస్తుపోయే అక్రమాస్తులు బయటపడుతాయని నీటి పారుదల శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇరిగేషన్ శాఖలోని ఈఎన్సీ హరిరామ్ పై దాడులు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు “ENC” ని మించి ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతున్న “సుధాకరుడి”పై దృష్టి సారించి విచారణ చేస్తారో లేదో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.