- అక్రమ వెంచర్లలోని వందలాది ప్లాట్లను గజాల వారీగా కన్వర్షన్
- జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి భారీగా గండి
- భారీగా ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం
Corruption in Kazipet | ఒక్కటి కాదు.. రెండూ కాదు.. వందల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు చేసి సదరు తహసీల్దార్ రియల్టర్లకు ఊహించని రీతిలో సహకరించినట్లు తెలుస్తోంది. అనుమతి లేని వెంచర్లలోని వందలాది ప్లాట్లను సదరు తహసీల్దార్ (Tahasilar) నాలా కన్వర్షన్ (Nala Conversion) చేయడంతో రియల్టర్లు ఆ తహసీల్దార్ ను కన్వర్షన్ కిం(సిం)గ్ పిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంచర్ అక్రమం అని తెలిసినా, జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి రియల్టర్లు గండి కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. సదరు తహసీల్దార్ ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను (రియల్టర్ చేసిన ప్లాట్లకు అనుగుణంగా, గజాల వారీగా) నాలా కన్వర్షన్ చేసి రియల్టర్లకు రిస్క్ లేకుండా చేసినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల ముందు బదిలీపై హన్మకొండ జిల్లా కాజీపేట కు వచ్చిన సదరు తహశీల్దార్ బాధ్యతలు చేపట్టినప్పటినుండి అనుమతి లేని వెంచర్ లపై దృష్టిసారించి రియల్టర్ లకు అనుకూలంగా నాలా కన్వర్షన్ లు చేసి పెద్దమొత్తంలో ముడుపులు (Corruption) కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సదరు తహశీల్దార్ అనుమతి లేని వెంచర్ లలోని వందలాది ప్లాట్లను నాలా కన్వర్షన్ చేసి హన్మకొండ జిల్లాలో హటాపిక్ గా మారడంటే ఆ తహశీల్దార్ ఏ రేంజ్ లో ప్లాట్లను నాలా కన్వర్షన్ చేశాడో అర్ధంచేసుకోవచ్చు.
Corruption : విచారణ చేస్తే విస్తుపోవాల్సిందే…
హన్మకొండ జిల్లా (Hanmakonda )కాజీపేట తహసీల్దార్ (Kazipet tahsildar)గా బాధ్యతలు చేపట్టిన బావుసింగ్ నాటి నుండి నేటి వరకు మండల పరిధిలోని అనేక అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారిగా నాలా కన్వర్షన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అనుమతి లేని వెంచర్ (Non Layout)లోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు (Sub Registrar) రిజిస్ట్రేషన్ కు నిరాకరించడంతో సదరు అధికారి కి డిమాండ్ బాగా పెరిగింది. అక్రమ వెంచర్లు చేసిన రియల్టర్ లు తహశీల్దార్ వద్దకు క్యూ కట్టగా ఇదే అదునుగా భావించిన అధికారి ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని గజాల వారీగా రియల్టర్ (Realtors) లకు నచ్చిన విధంగా వందల సంఖ్యలో ప్లాట్లను నాలా కన్వర్షన్ చేశారు. తమకు అనుకూలంగా గజాల వారిగా ప్లాట్లకు నాలా చేయడంతో రియల్టర్ లు సైతం సారుకు ప్లాట్ల వారీగా ముడుపులు (Corruption) చెల్లించినట్లు ఆరోపణలు లేకపోలేదు.సదరు తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి ఇప్పటి వరకు చేసిన నాలా లపై విచారణ చేస్తే ఉన్నతాధికారులు సైతం విస్తుపోతారని మాతృశాఖలోనే ప్రచారం జరగడం కొసమెరుపు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..