- అధికారుల వసూళ్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
- ప్రైవేట్ అసిస్టెంట్ లే కలెక్షన్ బాయ్స్
- అధికారి నుంచి క్లర్క్ వరకు ఎవరి రేటు వారిదే..
- మామూళ్ల మొత్తం నుంచి ప్రైవేట్ అసిస్టెంట్లకు 9% కమీషన్
Corruption in RTA | ప్రస్తుతం వాతావరణ ప్రభావం వల్ల దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ కార్యాలయంలో మాత్రం ప్రతీ రోజు కనకవర్షమే కురుస్తుందట. సాధారణంగా వర్షం కురిస్తే రైతులు సంతోషిస్తారు ఎందుకంటే వారు పండించే పంటలకు నీరు అందుతోంది కనుక, కానీ ఈ కార్యాలయంలో కనకవర్షం కురుస్తుండంతో ఆ కార్యాలయంలోని అధికారితో సహా క్లర్క్ వరకు అందరూ ఆనందోత్సహంలో తేలియాడుతున్నారట. ఎందుకంటే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారితో సహా, క్లర్క్ వరకు రోజు వారి వారి హోదాను బట్టి కోడ్(చుక్క)ల రూపంలో ముడుపులు వస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిందని తెలుస్తోంది.
హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం అవినీతిమయం..
హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి ( Corruption in RTA Hanmakonda ) రాజ్యమేలుతున్నట్లు తెలుస్తోంది. కార్యాలయానికి ఏ సేవలకోసం వచ్చినా ప్రతి పనికి ఓ రేటు సమర్పించుకోవాల్సిందేనని, లేదంటే వారి పనులు ఏదోఒక సాకుతో పక్కన పెడుతుంటారని ప్రచారం లేకపోలేదు. సదరు కార్యాలయంలో ఉన్నతాధికారి నుండి క్లర్క్ వరకు హోదాను బట్టి రాబడి ఉంటుందని , వారి వసూళ్ల భాగోతం చూస్తే దిమ్మతిరగాల్సిందేనని విశ్వసనీయం సమాచారం.హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారులకు ఏ పని కావాలన్న అధికారులు నియమించుకున్న ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిసి వారు అడిగిన మొత్తం సమర్పించుకోవాలని లేదంటే వారి పని మూలన పడుతుందని నెలల తరబడి తిరిగినా పని కాదని చివరికి ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిస్తేనే పని అవుతుందని విశ్వసనీయ సమాచారం.
కోడ్(చుక్క)ఉంటే చాలు..
ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని కావాలన్నా సంబంధిత అధికారులకు సంబంధించిన ప్రైవేట్ అసిస్టెంట్ ల కోడ్ తప్పనిసరి అని తెలియవచ్చింది. ఈ కార్యాలయంలో డిటిసి మొదలుకొని క్లర్క్ వరకు ప్రతి ఉద్యోగి కార్యాలయం వెలుపల తమకు సంబంధించి అసిస్టెంట్ లను నియమించుకొని దందా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.కార్యాలయానికి వచ్చే వాహనదారుల పత్రాలపై వారి అసిస్టెంట్ ల కోడ్(చుక్క)కనపడితే క్షణాల్లో పని అయిపోతుందని, కోడ్(చుక్క)లేకుండా వచ్చే వాహనదారులను నానా కొర్రీలు పెట్టి నెలల తరబడి తిప్పుతుంటారని సమాచారం.అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ లు కోడ్ (చుక్క)ల రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని అధికారులకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారని, ఈ మొత్తంలో అసిస్టెంట్ లకు 9% కమీషన్ కూడా అధికారులు ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
ఏ సేవకు ఎంత లంచం.. అందులో నుండి ఎవరి సంతకానికి ఎంత ?
వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు కంటే కూడా లంచాల(చుక్క) రూపంలో అధికారులకు చెల్లించే ఫీజు అధికం అని తెలుస్తోంది. వాహనదారులు ఏ సేవకు ప్రభుత్వానికి ఎంత ఫీజు చెల్లిస్తారు..అదే సేవకు కార్యాలయంలో వారి ప్రైవేట్ అసిస్టెంట్ లకు లంచాలు ఎంత సమర్పించుకుంటారు. పూర్తి వివరాలు…
లైసెన్స్ లకు….ప్రభుత్వ ఫీజు వివరాలు… లంచాల వివరాలు..
- లెర్నింగ్ లైసెన్స్ కు: ప్రభుత్వ ఫీజు-450
లంచం: 1000 అందులోనుండి ఎంవీఐ కి 900 ,క్లర్క్ కు 100 - పర్మినెంట్ లైసెన్స్ కు:ప్రభుత్వ ఫీజు-1335
లంచం:1500 ఈ మొత్తం ఎంవీఐ కే.. - హెవీ లైసెన్స్ కు : ప్రభుత్వ ఫీజు-1600
లంచం:3300 ఈ మొత్తం ఎంవీఐ కే - ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కు:ప్రభుత్వ ఫీజు-1335
లంచం:2100 ఈ మొత్తం ఎంవీఐ కే
కొత్త వాహన రిజిస్ట్రేషన్ లు (RTA Corruption )
వీటికి ప్రభుత్వ ఫీజు ఉండదు లంచాల వివరాలు…
నాన్ ట్రాన్స్ పోర్ట్ (సొంతవాహనాలు) :
- టూ వీలర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం: 450 అందులో నుంచి ఎంవీఐకి 250, ఏవోకు 100, క్లర్క్ కు 100 - కార్లకు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం: 1000 అందులోనుండి ఎంవీఐ కి600,ఏవో కు 200,క్లర్క్ కు 200 - 3 వీలర్&ఆటో రిక్షా ప్యాసింజర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:3000 అందులోనుండి డిటివో కు2000,ఎంవీఐ కి600,ఏవో200,క్లర్క్200 - LMV గూడ్స్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:1800 అందులోనుండి డిటివో కు200,ఎంవీఐ1200,ఏవో 200,క్లర్క్200 - ట్రాక్టర్ ట్రాలీ కి: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:2900 అందులోనుండి ఎంవీఐ కి1500,డిటివో కు800,ఏవో కు300,క్లర్క్300 - మోటార్ క్యాబ్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:4600అందులోనుండి డిటివో కు2200,ఎంవీఐ కి1400,ఏవో కు500,క్లర్క్ కు 500 - మీడియం గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:5200 అందులోనుండి డిటివో కు2200,ఎంవీఐ2200,ఏవోకు500,క్లర్క్ కు500 - హెవీ గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:10,700 అందులోనుండి ఎంవీఐ కి5500,డిటివో కు3200,ఏవో కు1000,క్లర్క్ కు1000 - జేసీబీ కి: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం:5700 అందులోనుండి ఎంవీఐ కి2400,డిటివో కు2200,ఏవో కు500,క్లర్క్ కు500 - హార్వెస్టర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం: 9900అందులోనుండి డిటివో కు5500,ఎంవీఐ కి2400ఏవో కు1000క్లర్క్ కు1000
ఫిట్ నెస్ లు.. ప్రభుత్వ ఫీజు… లంచాల వివరాలు…
- ఆటో రిక్షా ఫిట్ నెస్ కి: ప్రభుత్వ ఫీజు-600
లంచం: 500 అందులోనుండి ఎంవీఐ కి400క్లర్క్ కు100 - LMV గూడ్స్ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు-800
లంచం: 1100 అందులోనుండి ఎంవీఐ కి1000,క్లర్క్ కు100 - ట్రాక్టర్ ట్రాలీ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు-800
లంచం: 1500 అందులోనుండి ఎంవీఐ కి1400,క్లర్క్ కు100 - మోటార్ క్యాబ్ ఫిట్ నెస్ కు :ప్రభుత్వ ఫీజు-800
లంచం: 1000అందులోనుండి ఎంవీఐ కి900,క్లర్క్ కు100 - మీడియం గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు-1000
లంచం :1900అందులోనుండి ఎంవీఐ కి1800,క్లర్క్ కు100 - హెవీ గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు-1000
లంచం: 2300 అందులోనుండి ఎంవీఐ కి2200,క్లర్క్ కు100
పైన పేర్కొన్న లంచాల వివరాలను చూస్తే హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో కనకవర్షం కురుస్తుందా? లేదా మీరే చెప్పండి..
నాన్ ట్రాన్స్ పోర్ట్ (సొంతవాహనాలు) :
సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం |
ఆటో రిక్షా ఫిట్ నెస్ | 500 | ఎంవీఐకి 400 క్లర్క్ కు 100 |
LMV గూడ్స్ ఫిట్ నెస్ | 800 | మొత్తం రూ.1800 డిటివో కు 200 ఎంవీఐ1200 ఏవో 200, క్లర్క్ 200 |
3 వీలర్&ఆటో రిక్షా ప్యాసింజర్ | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.3000 అందులో నుంచి డిటివోకు 2000, ఎంవీఐకి 600, ఏవోకు 200, క్లర్క్ కు 200 |
ట్రాక్టర్ ట్రాలీ | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.2900 అందులో నుంచి ఎంవీఐకి 1500, డిటివో కు 800, ఏవోకు 300, క్లర్క్300 |
మోటార్ క్యాబ్ | ప్రభుత్వ ఫీజు లేదు | లంచం :4600 అందులో నుంచి డిటివో కు 2200, ఎంవీఐ కి 1400, ఏవోకు 500, క్లర్క్ కు 500 |
మీడియం గూడ్స్ వెహికిల్ కు: | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.5200 అందులో నుండి డిటివోకు 2200, ఎంవీఐకి 2200, ఏవోకు 500, క్లర్క్ కు 500 |
హెవీ గూడ్స్ వెహికిల్ కు: | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.10,700 అందులో నుండి ఎంవీఐ కి 5500, డిటివోకు 3200, ఏవోకు1000, క్లర్క్ కు1000 |
జేసీబీ కి: | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.5700 అందులో నుంచి ఎంవీఐకి 2400, డిటివో కు 2200, ఏవోకు 500, క్లర్క్ కు 500 |
హార్వెస్టర్ కు: | ప్రభుత్వ ఫీజు లేదు | రూ.9900 అందులో నుంచి డిటివోకు 5500, ఎంవీఐకి 2400 ఏవోకు1000, క్లర్క్ కు1000 |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “RTA Corruption | ఆ కార్యాలయంలో కనకవర్షం..”