- ప్రతీ పనిలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు..
- సదరు ఉద్యోగి వ్యవహారశైలి పై అసహనంగా ఉద్యోగులు
- ఇంచార్జి సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఏమైనట్లో..?
Corruptions in TB Hospital | హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ ఛాతి-క్షయ వైద్యశాల (TB Hospital) లో ఓ జూనియర్ అసిస్టెంట్ తన హవాను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) వ్యవహారం ఇప్పుడు ఆ ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. టీబీ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడంతో సదరు ఉద్యోగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి పనిలో చేతివాటం ప్రదర్శించే సదరు జూనియర్ అసిస్టెంట్ ఇప్పుడు ఐటీ పై దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను సదరు జూనియర్ అసిస్టెంట్ మామూళ్ల ( Corruptions ) పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Corruptions | వాచ్ మెన్ ను సైతం వదలలేదట…?
టీబీ ఆసుపత్రిలో గత కొన్నిసంవత్సరాలుగ విధులు నిర్వహించి కొన్ని నెలల క్రితం రిటైర్డ్ అయిన ఓ వాచ్ మెన్ సైతం ఈ జూనియర్ అసిస్టెంట్ వదిలిపెట్టలేదని హాస్పిటల్ లో ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ అయ్యాక సదరు వాచ్ మెన్ కు రావాల్సిన బెనిఫిట్స్ (Retainment Benefits ) విషయంలో ఈ ఉద్యోగి రూ.40 వేలకు పైగా ముక్కు పిండి మరీ వసూళ్లు (Corruptions) చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇటీవల ఫోర్త్ క్లాస్ ఎంప్లాయి ఉద్యోగ విరమణ పొందగా బెనిఫిట్స్ కు సంబంధించిన బిల్లులు చేయాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందేనని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. పైగా నీకంటే ముందుగా రిటైర్డ్ అయిన వాచ్ మెన్ ఎంతిచ్చాడో అడిగినాకే నువ్వు ఇవ్వు అని తేల్చిచెప్పడంతో సదరు మహిళా ఉద్యోగి చేసేదేంలేక అడ్వాన్స్ గా రూ.30 వేలు చెల్లించిందని తోటి ఉద్యోగులు సదరు జూనియర్ అసిస్టెంట్ వసూళ్ల వ్యవహారంపై మండిపడుతున్నారు.
జీతాలు చేయాలన్నా, ఏదైనా బిల్లులు పెట్టాలన్నా.. చేతివాటం ప్రదర్శించే సదరు జూనియర్ అసిస్టెంట్ దృష్టి ఇప్పుడు ఐటీపై పడిందని, ఒక్కో ఉద్యోగి నుంచి మినిమమ్ వెయ్యి రూపాయలకుకి పైగా వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆసుపత్రిలోని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
ఇంచార్జి సూపరింటెండెంట్ ఏంచేస్తున్నట్లు..?
ఛాతి మరియు క్షయ రోగులకు పెద్దదిక్కుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ఓ జూనియర్ అసిస్టెంట్ అవినీతి పాల్పడుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంచార్జి సూపరింటెండెంట్ తమకేం పట్టనట్లు వ్యవహరించడంపై కార్యాలయ సిబ్బంది తో పాటు ఉద్యోగులు మేడం తీరుపై అసహనంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆసుపత్రికి పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడం వల్లే సదరు జూనియర్ అసిస్టెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఇంచార్జి సూపరింటెండెంట్ కార్యాలయంలో జరుగుతున్న వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..