ఆ తహసీల్దార్లు అక్రమంగా కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు
Corruptions in Revenue Deportment | రెవెన్యూ శాఖ లో అవినీతి తిమింగలాలు …అదేంటి తిమింగలాలు సముద్రంలో కదా ఉండేది, రెవెన్యూ శాఖలో ఉండడమేంటి అని అనుకుంటున్నారా…? అవునండి ఇది నిజం సముద్రంలో ఉండే తిమింగలాలకు ఏ మాత్రం తీసిపోకుండా రెవెన్యూ శాఖలో అవినీతి (Corruption) తిమింగలాలు దర్జాగా విధులు నిర్వహిస్తున్నాయి. సముద్రంలో ఉండే తిమింగలాలు సముద్రంలో జీవిస్తున్న చిన్నాచితకా జీవులను తింటుంటే, సమాజంలో మండల మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న కొంతమంది తహసీల్దార్ (Tahsildar)లు ప్రజల రక్తాన్ని మామూళ్ల రూపంలో తాగుతూ రెవెన్యూ శాఖ (Revenue Deportment) లో అవినీతి తిమింగలాలుగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.
కలిసొచ్చిన “ధరణి”
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం “ధరణి (Dharani) ” ని తీసుకువచ్చింది. ధరణి తో రైతులకు ఎంతమేరకు లాభం జరిగిందో పక్కనపెడితే, కొంతమంది తహసీల్దార్ లకు మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పవచ్చు. ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది తహసీల్దార్ నానా కొర్రీలు పెట్టి అందినకాడికి దండుకున్నట్లు ప్రచారం లేకపోలేదు. ప్రసన్నం చేసుకున్నవారికి సులువుగా పనిచేసిపెట్టిన వీరు, ముడుపులు చెల్లించనివారిని మాత్రం ముప్పుతిప్పలు పెట్టి నిబంధనల పేరుతో ఫైల్స్ ను తిరస్కరించేవారని విశ్వసనీయంగా తెలిసింది.రైతులకు ఏదో మేలు జరుగుతుందని గత ప్రభుత్వం”ధరణి” ని తీసుకొస్తే అది కాస్తా కొంతమంది తహసీల్దార్ లకు ఆదాయవనరుగా మారినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
Revenue Deportment : కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్లు..?
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అవినీతి జరుగుతున్న శాఖల్లో రెవెన్యూ శాఖ ( Telangana Revenue Deportment) కూడా ఒకటి.స్వయంగా అవినీతి నిరోధక శాఖ డీజి సైతం కొన్నినెలల క్రితం X (ట్విట్టర్ )లో ఆ విషయాన్ని పోస్ట్ చేశాడంటే ఏస్థాయిలో అవినీతి జరుగుతుందో చెప్పక్కర్లేదు. ఇక విషయానికి వస్తే ఈ శాఖలో కొంతమంది తహసీల్దార్ లు అక్రమంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టి బినామీ పేర్లతో ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) లో విధులు నిర్వహిస్తున్న ఓ ఆరుగురు తహసీల్దార్ లు అవినీతి తిమింగలాలు మారారని,వీరికి కావాల్సింది ముట్టజెపితే అక్రమాన్ని సైతం సక్రమం చేస్తున్నారని సమాచారం. సదరు తహసీల్దార్ లు బిజినెస్ మెన్ ల వలే పోటీపడి సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏసీబీ (ACB) కి పట్టుబడిన ఇరిగేషన్ ఏఈ నిఖేశ్,హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణన్, విద్యుత్ శాఖ గచ్చిబౌలి ఏడీఈ సతీష్, రవాణా శాఖ డిటిసి (Transport Deportment) శ్రీనివాస్ లను మించి వీరి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరగడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..