- అవినీతికి సూత్రధారులు..అధికారుల పేరుతో అక్రమాలు..
- అడిగిందిస్తే పాస్.. లేదంటే రిజెక్ట్..
- ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో మిల్లర్ లు..
- టెక్నికల్ అసిస్టెంట్ ల లావాదేవీలపై దృష్టి సారిస్తే విజిలెన్స్ సైతం విస్తుపోవాల్సిందేనట..
Telangana Civil supplies Deportment | అవినీతికి పాల్పడడంలో వారు ఆరితేరిపోయారట, ఆ శాఖలో ఇప్పుడు వారి రాజ్యమే నడుస్తోందట, వారికి నచ్చితే “ఎస్” లేదంటే “నో”…,ఇలా మిల్లర్ లతోపాటు, ఉన్నతాధికారులను సైతం వారు తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మిల్లర్ తీసుకొచ్చే సిఎంఆర్( బియ్యానికి) కు నానా కొర్రీలు పెట్టి మిల్లర్ ల వద్ద మామూళ్ల పేరుతో దండుకుంటున్న” TA” లు మరో అడుగు ముందుకేసి సిఎంఆర్(బియ్యం)నాణ్యత లేకున్నా ఒక్కో ఏసికే కు ఓ రేటు నిర్ణయించి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని సిఎంఆర్ ( CMR Rice )పాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డుల (Ration Cards) ద్వారా ఇచ్చే బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా తక్కువ రేటుకు కొనుగోలు చేసి కొంతమంది మిల్లర్ అవే బియ్యాన్ని ప్రభుత్వానికి సిఎంఆర్ రూపంలో పెడుతుండగా వారి వద్ద నుండి మామూళ్లు తీసుకుంటున్న టెక్నికల్ అసిస్టెంట్ లు నాణ్యత పరిశీలించకుండానే పాస్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మిల్లర్ ల వద్ద మామూళ్ల (Corruptions) పేరుతో వసూళ్లు చేస్తున్న మొత్తంలో అధికారులు కూడా వాటాలు ఇవ్వడంతో ఇటు మిల్లర్ లు, అటు అధికారులు సైతం టెక్నికల్ అసిస్టెంట్ల (Technical Assistants) ల గుప్పిట్లో ఉంటున్నారనేది బహిరంగ రహస్యమే.
ఫిర్యాదు చేసే ఆలోచనలో మిల్లర్
మూడు రోజుల క్రితం రాష్ట్రంలో ఇసుక రీచుల్లో జరుగుతున్న దోపిడీ పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎలా అయితే రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారో అలాగే రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్ లు సివిల్ సప్లై (Civil supplies) టెక్నికల్ అసిస్టెంట్ ల ఆగడాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గోదాములకు తీసుకువచ్చే “సిఎంఆర్” నాణ్యత ఉన్నప్పటికీ కూడా ఒక్కో ఏసికేకు 3 నుండి 5 వేల వరకు టీఏ లకు సమర్పించుకోవాల్సి వస్తోందని కొంతమంది మిల్లర్ లు వాపోతున్నారు.ముడుపులు సమర్పించకపోతే గోదాముల్లో అన్ లోడ్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని నాణ్యత పేరుతో నానా కొర్రీలు పెడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ (Rice Millers)లు టీఏ లపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Civil supplies Deportment : ఉమ్మడి వరంగల్ లో “టీఏ” ల జోరు..
వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే (Civil supplies Out sourcing Employees) కానీ, ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోయేలా వారి సంపాదన ఉంటుందట, పౌరసరఫరాల శాఖతోపాటు, మిల్లర్ లలో వారి అక్రమ సంపాదన పై జోరుగా చర్చ జరుగుతోందంటే వీరి సంపాదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ (Warangal), హన్మకొండ, మహబూబాద్,భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో సివిల్ సప్లై లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న “టీఏ”లు డిసిఎస్ఓ, జిల్లా మేనేజర్ ల పేరుతో మిల్లర్ ల వద్ద నుండి ఒక్కో ఏసికే కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మామూళ్లు దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.కొందరు టీఏ లైతే మరో అడుగు ముందుకేసి మిల్లర్ లకు రీసైక్లింగ్ బియ్యాన్ని సర్దుతూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. వీరిలో కొంతమంది టీఏ లు ఒకే అపార్ట్మెంట్ లో ప్లాట్లు కూడా కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ ల లావాదేవీలు కనుక బయటపడితే పౌరసరఫరాల శాఖ (Civil supplies Department) లోని ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుందని తెలిసింది. కేవలం వీరిది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కావడంవల్లే ఇలా బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..