Court Jobs in Telangana 2025 : తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో 340 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు జీతంతో పాటు అదనపు అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 8
చివరి గడువు: 2025 జనవరి 31
అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ http://tshc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
వయస్సు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య.
సడలింపు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు. దివ్యాంగులకు 10 ఏళ్లు.
కట్ ఆఫ్ డేట్: 2025 జూలై 1.
Court Jobs Notification 2025 జీతం , ఇతర ప్రయోజనాలు
- వేతనం: రూ. 24,280 – రూ. 72,850 (పే స్కేల్ ఆధారంగా).
- నెలసరి కనీస జీతం: సుమారు రూ. 31,000 (అన్ని అలవెన్సులతో కలిపి).
- వార్షిక ప్యాకేజీ: రూ. 3.7 లక్షల నుంచి రూ. 8.7 లక్షల వరకు.
- ప్రత్యేక ప్రయోజనాలు : డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి తర్వాత ఇంక్రీమెంట్లు పొందే అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ బాధ్యతలు
 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ప్రధానంగా కార్యాలయ నిర్వహణకు సంబంధిత బాధ్యతలను కలిగి ఉంటుంది.
- టైపింగ్, ఫైళ్ల నిర్వహణ, రికార్డుల నిర్వహణ.
- డిస్పాచ్ పనులు, ఫైలింగ్, ఇండెక్సింగ్.
- సీనియర్ అధికారులకు అవసరమైన సహాయాన్ని అందించడం. ప్రతినెలా పేస్లిప్
 ప్రతి నెలా ఉద్యోగులకు పేస్లిప్ అందజేస్తారు.
 ఇందులో జీతం వివరాలు, అలవెన్సులు, కటింగులు తదితర వివరాలు ఉంటాయి. లోన్ కోసం అప్లై చేయడం, ట్యాక్స్ ఫారం సమర్పణ లేదా ఆర్థిక లెక్కల నిర్వహణ కోసం ఈ పేస్టిప్‌ను ఉపయోగించుకోవచ్చు. Court Jobs పై మరింత సమాచారం కోసం తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://tshc.gov.in
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    