Covid 19 Cases In India : గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ఆరోగ్య అధికారులు నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశంలో ప్రస్తుత కరోనావైరస్ పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ కేసులు చాలావరకు తేలికపాటివేనని, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని అధికారిక వర్గాలు తెలిపాయి.
కొవిడ్-19 కి సంబంధించిన ఈ పరిణామాల నేపథ్యంలో, ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధి పరిస్థితి నియంత్రణలోనే ఉందని తేల్చారు. “భారతదేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని సమావేశం తేల్చింది. మే 19, 2025 నాటికి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా ఉంది. ఇది దేశంలోని పెద్ద జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ. ఈ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని తెలుస్తోంది.
ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షత వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) విభాగం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.