Cow’s Last Rites: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Cops) తమ సామాజిక బాధ్యతను (social responsibility) చాటుకున్నారు. మృతి చెందిన ఆవుకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు (Cow’s Last Rites) నిర్వహించారు. ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెస్లీ, మొబైల్ కానిస్టేబుల్ టి. సురేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి సెంటర్‌లో రోడ్డుపై చనిపోయి ఉన్న ఆవు కనిపించింది. దీంతో వారిద్దరు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రబద్ధీకరించారు.
సొంత ఖర్చుతో అంత్యక్రియలు
పోలీసులు కాంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆవు మృతదేహాన్ని త్రిముల్‌ఘెర్రీలోని గాంధీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గుంత తవ్వించి సమాధి చేశారు. ఈ అంత్యక్రియల (final rites)కు సంబంధించిన ఖర్చును స్వయంగా ఆ ఇద్దరు అధికారులే భరించారు.
Hyderabad Traffic Police : ఇద్దరు పోలీసులపై ప్రశంసల జల్లు
ఈ చర్యపై సీనియర్ పోలీసు అధికారులు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి సేవలు చేయడం సామాజిక బాధ్యత అని ఇద్దరు అధికారులు నిరూపించారు. ఇది ఇతరులకు ఆదర్శం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల (Traffic Cops) నిబద్ధతకు ఇది ప్రతీక” అని కొనియాడారు. అనంతరం జోనల్ అధికారుల తరఫున ఆ ఇద్దరు అధికారులను సత్కరించారు.
దీనిపై ట్రాఫిక్-I నార్త్ జోన్ ఏసీపీ జి. శంకర్ రాజు ( ACP G. Shankar Raju) మాట్లాడుతూ “వీరు మానవతా దృక్పథంతో ఆవును ఖననం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే కాకుండా, మతపరమైన భావజాలాన్ని కూడా గౌరవించారు” అని ప్రశంసించారు. పోలీసులు చూపిన ఈ ఉదాత్తమైన చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. నగరంలో శాంతి భద్రతలకే కాకుండా, సామాజిక బాధ్యతలపైనా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రజలు అభినందిస్తున్నారు. పోలీసులు తమ దైనందిన డ్యూటీలకే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తించడం గొప్ప విషయమని కొనియాడారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    