Accident | గజ్వేల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టి పోయింది .దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా మృతుడు పరందాములు స్వగ్రామం సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు కాగా, వెంకటేశ్ స్వగ్రామం గాడిచర్లపల్లి. మృతులు వెంకటేష్, పరంధాములు ప్రస్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి
సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు పరందాములు, వెంకటేశ్వర్లు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగంలో నిబద్దత కలిగిన యువ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. వీరిద్దరూ ఉద్యోగులుగా కాకుండా సామాజిక సేవకులుగా, వీరు యువకులకు ఎంతో స్ఫూర్తినిచ్చారని, సిద్దిపేటలో జరిగిన హాఫ్ మారథాన్ యువకుల్లో ఎంతో చైతన్యం నింపారని తెలిపారు. ఉచిత కానిస్టేబుల్ కోచింగ్, ఇతర సామాజిక సేవల్లో వారు అందించిన సేవలను మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు… ఇంకా సమాజంలో ఎన్నో చేయాల్సిన వీరికి ఇలా జరగడం చిన్న వయస్సులోనే తిరిగిలోకానికి వెళ్లడం బాధాకరమన్నారు… వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
One thought on “వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి”