Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది.
రాష్ట్రవ్యాప్తంగా నష్టోయిన పంటల వివరాలు
- వరి 36,424 ఎకరాలు,
- మొక్కజొన్న 3,266 ఎకరాలు,
- జొన్న 470 ఎకరాలు,
- ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
- పత్తి 4753 ఎకరాలు
- ఇతర పంటలు 477 ఎకరాలు
Crop Loss Compensation : జిల్లాల వారీగా పంట నష్టపోయిన వివరాలు
| క్రమ సంఖ్య | జిల్లా పేరు | రైతుల సంఖ్య | పరిహారం (రూ కోట్లలో ) |
|---|---|---|---|
| 1 | సిద్దిపేట | 4913 | 6.141 |
| 2 | ములుగు | 2933 | 5.727 |
| 3 | జగిత్యాల | 5099 | 5.453 |
| 4 | మంచిర్యాల | 3017 | 4.597 |
| 5 | మహబూబ్ నగర్ | 3888 | 4.003 |
| 6 | పెద్దపల్లి | 3297 | 3.567 |
| 7 | మహబూబాబాద్ | 3097 | 3.519 |
| 8 | జనగామ | 2160 | 3.364 |
| 9 | నిజామాబాద్ | 1512 | 1.674 |
| 10 | సిరిసిల్ల | 1449 | 1.671 |
| 11 | యాదాద్రి | 1168 | 1.631 |
| 12 | నాగర్ కుర్నూల్ | 1034 | 1.588 |
| 13 | మెదక్ | 1313 | 1.144 |
| 14 | సూర్యాపేట్ | 662 | 1.104 |
| 15 | వనపర్తి | 888 | 0.877 |
| 16 | వికారాబాద్ | 912 | 0.764 |
| 17 | నల్గొండ | 710 | 0.759 |
| 18 | కామారెడ్డి | 879 | 0.740 |
| 19 | KB ఆసిఫాబాద్ | 412 | 0.609 |
| 20 | రంగారెడ్డి | 413 | 0.563 |
| 21 | నారాయణపేట్ | 354 | 0.520 |
| 22 | ఖమ్మం | 299 | 0.474 |
| 23 | సంగారెడ్డి | 334 | 0.421 |
| 24 | ఆదిలాబాద్ | 234 | 0.246 |
| 25 | కరీంనగర్ | 193 | 0.146 |
| 26 | నిర్మల్ | 127 | 0.128 |
| 27 | కొత్తగూడెం | 36 | 0.050 |
| 28 | వరంగల్ | 24 | 0.043 |
| మొత్తం | 41361 | 51.528 |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








