CUET PG 2025 : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) భారత ప్రభుత్వ మౌలిక విద్యాశాఖ, యూజీసీ (UGC) నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్ చేసిన విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం దీన్ని నిర్వహిస్తారు. ఈ CUET ద్వారా విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది.
CUET PG 2025 ఎందుకంటే..
విద్యార్థులకు సమానమైన అవకాశాలను కల్పించడమే CUET నిర్వహణ ముఖ్యోద్దేశం. ఈ పరీక్షలో మొత్తం ప్రశ్నలు బహుళ ఎంపిక పద్ధతిలో ఉంటాయి (MCQs). ప్రతి సమాధానానికీ 4 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు ఉంటుంది. పరీక్షా పత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
CUET PG 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 02-1-20025 నుంచి 01-2- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు (రెండు పేపర్లకు)
- రూ. 1200 (జనరల్)
- రూ. 1000 (ఓబీసీ -ఎన్‌సీఎల్/జనరల్-ఈడబ్ల్యూఎస్)
- రూ. 900 (ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్)
- రూ. 800 (PwBD)
అలాగే ప్రతి అదనపు పరీక్ష పేపర్‌కూ అదనపు ఫీజు ఉంటుంది. పరీక్షా విధానం - మొత్తం 100 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
- 90 నిమిషాల సమయం ఉంటుంది.
- ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు ఉంటుంది. అర్హత
- గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి
- వయసుకు పరిమితి లేదు. ఎవరైనా రాయొచ్చు.. ముఖ్య తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 02-1-2025
- దరఖాస్తు ముగింపు: 01-2- 2025
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 02-2-2025
- అప్లికేషన్‌ను కరెక్షన్ చేసుకొనేందుకు : 03-2-2025 నుంచి 05-2- 2025 వరకు
- పరీక్షా కేంద్రం ప్రకటింపు: మార్చి మొదటి వారం
- హాల్ టికెట్ డౌన్‌లోడ్: పరీక్షకు 4 రోజుల ముందు
- ఎగ్జామ్ డేట్స్ : 13-3-2025 నుంచి 3-3- 2025 వరకు దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్ (https://cuet.nta.nic.in/ ) (https://cuet.nta.nic.in/)ను ఓపెన్ చేయండి.
- ‘New Registration’ పై క్లిక్ చేసి, సూచనలను చదవండి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకోండి. ముఖ్య గమనిక
- ఒక అభ్యర్థి ఒకే దరఖాస్తు ఫారమ్‌ను మాత్రమే సమర్పించాలి.
- ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, పూర్తి వివరాలను తెలుసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 thoughts on “CUET PG 2025 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్.. అప్లికేషన్ల స్వీకరణ”
Good article