Daku Maharaj New Trailer : మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా నందమూరి నటసింహం బాలకృష్ణ నయా మూవీ డాకు మహారాజ్ నుండి మేకర్స్ రెండో ట్రైలర్ను రిలీజ్ చేశారు. బాలయ్య సినిమా అంటేనే మాస్ డైలాగ్స్.. ట్రైలర్లో అలాంటి డైలాగులు మచ్చుకు రెండు మూడు వదిలారు.
‘నువ్వు చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశా.. మాస్టర్స్ ఎన్ మర్డర్స్’, ‘అలాగే నువ్వు అరిస్తే పార్కింగ్స్..నేను అరిస్తే ‘ అనే డైలాగ్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్లో తమన్ సింహం గర్జించిన సౌండ్ ఇవ్వడం ట్రైలర్ లో హైలెట్. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై కి చేరుకున్నాయి.
కాగా కొత్త ట్రైలర్ ట్రైలర్ ( Daku Maharaj New Trailer ) మొదలవగానే బాలకృష్ణను ఉద్దేశిస్తూ విలన్ ఒక డైలాగ్ చెప్తాడు..అతని శరీరం మీద 16 కత్తిపోట్లు అన్నప్పుడు విలన్స్ చుట్టుముట్టి నరికేయడం , ఒక బుల్లెట్ గాయం అన్నప్పుడు విలన్స్ లో ఒకరు బాలకృష్ణ (Bala Krishna) భుజం మీద కాల్చడం, అయినా కింద పడకుండా అంతమందిని నరికాడు అంటే అతడు మనిషి కాదు వైల్డ్ యా నిమల్ అని చెప్పే డైలాగ్ సినిమా ఎంత మాస్ గా ఉండబోతుందో తెలుస్తోంది.
ఈ మూవీ డైరెక్టర్ బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య హిట్టుతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆ మూవీలో హీరోని స్టైలిష్ గా మునుపటి చిరుని చూపించి హిట్టు కొట్టాడు. అదే ఊపులో బాలకృష్ణ కి కూడా సూపర్ హిట్టు ఇస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ట్రైలర్ కూడా ఈసారి కూడా హిట్ గ్యారెంటీ అన్న లెవెల్ లో ఉంది.
ఇదిలా ఉండగా ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Nagavamshi) నిర్మించారు మూవీలో బాబి డియోల్ విలన్ పాత్ర పోషించారు. హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ నటించగా తమన్ మ్యూజిక్ అందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Daku Maharaj New Trailer : నయా ట్రైలర్ అదిరిందయ్యా..!”