Daku Maharaj | బాలయ్య తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే నందమూరి బాలకృష్ణ 109వ చిత్రానికి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. ‘రేజ్ ఆఫ్ డాకు’ అనే టైటిల్ తో ఇందులోని మొదటి పాట విడుదలైంది. భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి రావ్, కె. ప్రణతిల ఫుట్ ట్యాపింగ్ గాత్రంతో, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట యూట్యూబ్ లో సందడి చేస్తోంది. థమన్ ట్యూన్ చేసి ఈ ట్రాక్ బాలకృష్ణ అభిమానులలో, అంతకు మించి సినిమా పట్ల ఉత్సుకతను పెంచుతుంది.
“లిరికల్ వీడియో (Daku Maharaj Movie ) తన ఎలక్ట్రిఫైయింగ్ రిథమ్, అద్భుతమైన విజువల్స్, బాలకృష్ణ తన అత్యంత కమాండింగ్ అవతార్‌లో డైనమిక్ ప్రెజెంటేషన్‌తో అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది. విజువల్స్ గ్రామీణ ప్రకృతి దృశ్యాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా నటిస్తున్నారు. ఇందులో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ (Shradha Shreenath), చాందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్ తదితరులు కూడా విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. NBK109 సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ కన్నన్ అందించారు. ఎడిటింగ్ నిరంజన్ దేవరమానే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి అందించారు. ఇక ఈ డాకు మహరాజ్ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ‘దాకు మహారాజ్’ విడుదల కానుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..