Daku Maharaj Review : నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చిత్రాలు బాక్సాఫీస్ (Box office) ని షేక్ చేస్తున్నాయి. డైరెక్టర్లు కూడా ఆయనలో ఉన్న మాస్ ని వాడుకొని సక్సెస్ లు అందుకుంటున్నారు. ఆయన గత చిత్రాలు వీర సింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాలను చూస్తే మాస్ ఆడియన్స్ లో ఇంకా క్రేజ్ పెంచుకున్నారు. ఆ సినిమాలు ఒకదానికంటే మరొకటి హిట్ అయ్యాయి. ఈరోజు బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
డాకు మహారాజు మూవీ రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ. కథలో పెద్దగా కొత్తదనం ఏమి అనిపించదు కానీ బాలకృష్ణ పర్ఫామెన్స్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ ఆడియన్స్ కు బాలకృష్ణ సినిమా అంటేనే ఒక జాతర. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంది.
బాలకృష్ణ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఈ మూవీలో కూడా ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతారు. డాకు మహారాజ్ గా దుమ్ము దులిపారు. ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి.
ట్రైలర్ లో చూపించిన విధంగానే బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ కూడా ఎక్కడ కూడా తగ్గవు. ఫస్టాఫ్ లో ఆడియన్స్ బోర్ గా ఫీల్ అవ్వకుండా డైరెక్టర్ బాబీ (Director Bobby) టేకింగ్ చేసిన విధానం బాగుంది. ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎమోషన్స్ సీన్స్ ని కూడా బాగానే క్యారీ చేశాడు.
Daku Maharaj Review : అదిరిపోయిన పాటలు
పాటలు కూడా సిట్చువేషన్ కి తగ్గట్టుగా వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు కొంచెం స్లోగా అనిపించినా కథ మాత్రం పక్కకు పోలేదనిపించింది. మొదటినుంచి స్టోరీకి తగ్గట్టుగానే సీన్స్ వస్తాయి. కానీ అక్కడక్కడ ఒకటి రెండు సీన్లు మాత్రం అనవసరంగా తీశారని అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం డైరెక్టర్ బాబీ సరిగ్గా ప్లాన్ చేయలేదేమో అనిపించింది. అది కూడా కరెక్ట్ గా వచ్చుంటే సినిమాకు తిరుగు ఉండేది కాదేమో అనిపించింది. ఆ ఒక్కటి ఈ సినిమాకు కొంచెం మైనస్ గా మారుతుందేమో. ఓవరాల్ గా మూవీ మాత్రం మాస్ ఆడియన్స్ కి పండుగనే చెప్పొచ్చు. Daku Maharaj Review in Telugu
పాటలు మాత్రం అన్ని బాగున్నాయి. తమన్ (Taman) బీజీఎంతో మరొకసారి ఎక్స్ట్రార్డినరీ అనిపించుకున్నారు. బాలకృష్ణ గత మూడు సినిమాలకు కూడా తమనే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీకి కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రతి సీన్ కూడా ఆయన బీజీఎంతో ఎలివేట్ అయింది. తమన్ ఇచ్చిన బీజీఎం బాలకృష్ణ పర్ఫామెన్స్ కి మ్యాచ్ అయి మూవీని వేరే లెవెల్ లో పెట్టింది.
శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటన పర్వాలేదనిపించింది. ఊర్వశీ రౌతాల తో చేసిన ఐటమ్ సాంగ్ కూడా ఓకే అనిపించింది. బాబి డియోల్ విలనిజంతో మరొకసారి ఆకట్టుకున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ తీసిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ మాస్ సంక్రాంతి మహారాజ్ అనిపించుకుందని ఆడియన్స్ నుండి టాక్ వస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..