Dalapathi Vijay | కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తర్వాత తమిళంలో అంత ఫాలోయింగ్ కలిగిన నటుడుగా పేరు తెచ్చుకున్నారు దళపతి విజయ్ (Dalapathi Vijay). ఆయన మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా కాదు. 68 వ సినిమాగా వచ్చిన గోట్ మూవీనే ఆయన ఆఖరి సినిమా అనే ప్రచారం జరిగింది. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో మాస్టర్, లియో సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టారు.తర్వాత వచ్చిన గోట్ మూవీ కూడా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది.
ఈ మూవీ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ తమిళగ వెంట్రి కలగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2026 ఎలక్షన్లో పోటీకి రెడీ అవుతున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలనుకున్నారు. ఈ నిర్ణయంతో దళపతి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక వారి కోసం ఒక సినిమా చేసి పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఖాకీ మూవీ ఫేమ్ హెచ్ వినోద్(h.vinodh) డైరెక్షన్లో 69వ సినిమాకు శ్రీకారం చుట్టారు. కొన్ని రోజులుగా ఈ మూవీ టైటిల్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. కొందరు ఈ మూవీ బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని చర్చ జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్టు కొట్టిన అనిల్ రావిపూడిని విజయ్ పిలిచి మూవీ చేయాలని కోరారని కానీ కొన్ని కారణాలవల్ల అది ముందుకు జరగలేదని ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడే చెప్పారు. ఆ కథనే వినోద్ డైరెక్ట్ చేస్తున్నట్లుగా మూవీ టీమ్ మాత్రం ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు.
Dalapathi Vijay సినిమా ఇదే..
ఇదిలా ఉండగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా టైటిల్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. జననాయగన్ (Jana naayagan) అనే టైటిల్ ని ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆఖరి సినిమా కాబట్టి విజయ్ కి రాజకీయాల్లో ఉపయోగపడేలా ఈ మూవీని తెరకెక్కిస్తారని టైటిల్ ని చూస్తే అర్థమవుతుంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరోను ఆఖరిసారిగా తెరపై చూడడానికి ఆత్రుతగా ఉన్నారు. సినిమా ఎలా ఉన్నా సరే విజయ్ కెరీర్ లోనే ఒక బెస్ట్ మూవీ గా నిలిచిపోయేలా చేస్తామంటున్నారు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ పై నిర్మిస్తున్నారు. అనిరు ద్ మ్యూజిక్ అందిస్తుండగా బాబీ డియోల్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] చిరు విశ్వంభర మూవీ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) […]