బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే (deepika padukone)యాక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ (prabhas,amithab, Kamal Hassan)నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. నాగ్ అశ్విన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ సీక్వెల్ ను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న టీం వీలైనంత తొందరలోనే సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
Kalki కలెక్షన్స్ కి మించి..?
ఫస్ట్ పార్ట్ ను విజువల్ వండర్ గా ఆడియన్స్ కు అందించిన నాగ్ అశ్విన్..(nag ashvin)ఇప్పుడు తీయబోయే సెకండ్ పార్ట్ ను అంతకు మించి తీసి మరొకసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాలనుకుంటున్నాడు. మూవీ ఎప్పుడు వచ్చినా కలెక్షన్ల సునామి ఖాయమంటున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మరోసారి ఆ మార్కును దాటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజెంట్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తను కొంచెం ఫ్రీ అయితే చాలు మూవీని పట్టాలకెక్కిస్తారు.
ఫస్ట్ పార్ట్ కి సూపర్ రెస్పాన్స్..
అయితే ఈ మూవీలో హీరోయిన్ దీపికా పదుకునే క్యారెక్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ లో ఇంకా బాగుంటుందనుకున్న ఆడియన్స్ కి మూవీ టీం షాక్ ఇచ్చింది. సెకండ్ పార్ట్ లో దీపిక నటించట్లేదని ప్రొడ్యూసర్స్ అఫిషియల్ అనౌన్స్మెంట్ చేశారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.కల్కి లాంటి భారీ సినిమాకి నిబద్ధత ఉండాలని, మా మధ్య భాగస్వామ్యం కుదరలేదని, ఆమె ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుతున్నామని నిర్మాణ సంస్థ ఎక్స్ లో తెలిపారు.
అసలు దీపిక కు ఏమైంది..?
అసలు దీపిక కు ఏమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రభాస్ , వంగా కాంబినేషన్ లో మూవీ వదులుకుంది. ఇప్పుడేమో కల్కి లాంటి భారీ హిట్టు మూవీ సీక్వెల్ కి దూరమవుతుంది. ఇలా అయితే ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీ లో ఉండడం కష్టమేనని నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రభాస్, వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీలో ఫస్ట్ దీపికనే అనుకున్నారు. వారి మధ్య కొన్ని డిఫరెన్సెస్ వల్ల యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని సెలెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో దీపిక ప్లేస్ లో మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో మూవీ టీం ఉందట.ఏదేమైనా దీపికా ఒక మంచి సినిమాను దూరం చేసుకుందని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    