Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు..
న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది.
Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
పర్వేష్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలోని ఒక హిందూ జాట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తల్లి పేరు రాంప్యారి వర్మ, ప్రవేశ్ శర్మకు ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ప్రవేశ్ వర్మ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కె పురం
డిపిఎస్ లో పూర్తి చేశారు. ఆ తరువాత కిరోరి మాల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు
అనంతరం ఆయన ఎంబీఏ కూడా చేశారు.
ప్రవేశ్ వర్మ రాజకీయ ప్రస్థానం..
ప్రవేశ్ వర్మ రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే.. 2013 సంవత్సరంలో, ఆయన మెహ్రౌలి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు యోగానంద శాస్త్రిని ఓడించారు. దీని తరువాత, 2014 సంవత్సరంలో, అతను పశ్చిమ ఢిల్లీ స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రాను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, బీజేపీ పర్వేశ్ వర్మతో సహా 6 మంది అభ్యర్థులను మార్చింది, ఎందుకంటే పార్టీ ఆయనను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) పోటీ చేయాలని కోరుకుంది. 2025లో మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చింది. ప్రవేశ్ వర్మ కూడా పార్టీని నిరాశపరచలేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద ముఖమైన అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించడం ద్వారా, అతను న్యూఢిల్లీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసుకున్నాడు. బిజెపి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రవేశ్ వర్మను కూడా చేయగలదని భావిస్తున్నారు.
ప్రవేశ్ వర్మ ఆస్తి గురించి మాట్లాడుకుంటే, ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని మొత్తం ఆస్తి రూ.90 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో రూ.77.89 కోట్ల విలువైన చరాస్తులు, రూ.12.19 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూమి, గిడ్డంగులు, ఇళ్ళు ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..