British woman raped : ఓ బ్రిటిష్ మహిళ ఢిల్లీలోని మహిపాల్‌పూర్ ప్రాంతం (Delhi’s Mahipalpur area)లో ఉన్న హోటల్‌లో ఇద్దరు వ్యక్తుల చేతిలో లైంగిక వేధింపు, అత్యాచారానికి గురైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన మార్చి 11న చోటుచేసుకోగా ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేపట్టామని పోలీసులు (Police) ఈ రోజు వెల్లడించారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ హైకమిషన్ (British High Commission)కు కూడా ఈ విషయాన్ని సమాచారం అందించారు.
British woman raped : అసలేం జరిగిందంటే..
బాధితురాలు గోవా (Goa) పర్యటనకు రాగా సామాజిక మాధ్యమాల (social media) ద్వారా 24 ఏళ్ల కైలాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. కైలాష్ ఢిల్లీలో నివసించే వ్యక్తి. మొదట్లో సోషల్ మీడియా ద్వారా వారు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. అతడు తరచుగా ఆమెతో చాట్ చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ మరింత దగ్గరవగా అతడిని కలవాలని ఆ మహిళ నిర్ణయించింది. గోవా నుంచి ఢిల్లీ బయల్దేరింది. అక్కడికి చేరుకోగానే మహిపాల్‌పూర్‌లోని ఓ హోటల్ గదిని బుక్ చేసుకుంది. కైలాష్‌ను కలవడానికి వచ్చిన తాను హోటల్‌లో ఉండగా ఓ హౌస్‌కీపింగ్ సిబ్బంది లిఫ్ట్‌లో లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపిస్తోంది. అలాగే హోటల్ గదికి వచ్చిన కైలాష్ తనను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ చేపడుతున్న పోలీసులు
బ్రిటిష్ మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కైలాష్‌తోపాటు హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో హోటల్‌లోని సీసీ టీవీ ఫుటేజీ (CCTV footage)లను పరిశీలించడంతోపాటు మరిన్ని వివరాలను ఆరా తీస్తున్నారు. హోటల్ సిబ్బంది, బాధితురాలి స్నేహితులను విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్నార్థకంగా విదేశీ మహిళల భద్రత
ఇటీవల కాలంలో భారతదేశంలో విదేశీ పర్యాటకులు లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, గోవా, రాజస్థాన్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








