Detect heart failure : గుండె వైఫల్యం (Heart Failure)ను క్షణాల్లోనే ముందుగా పసిగట్టే పరికరం భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ దేశంలోనే మొట్టమొదటి అద్భుతమైన వైద్య ఆవిష్కరణగా నిలిచింది. దీనిని నారాయణ హెల్త్ (Narayana Health) క్లినికల్ రిసెర్చ్ టీం, మేధా ఏఐ (Medha AI) అనే అడ్వాన్స్ ఎనలైటిక్స్ అండ్ ఏఐ (Advanced Analytics & AI) విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ECG చిత్రాల ఆధారంగా గుండె పనితీరును ముందే అంచనా వేసేలా దీన్ని రూపొందించారు.
Detect heart failure : గ్రామీణ ప్రాంతాలకు పెద్ద వరం
ఇది వనరులు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడే ఆవిష్కరణ. మారుమూల ప్రాంతాల్లో చాలామంది రోగులకు గుండె సమస్యలు ఉన్నా అవసరమైన పరీక్షలు తీసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా “ఇకో” (Echocardiography), గుండె పనితీరును అంచనా వేయడంలో ప్రాముఖ్యత గల పరీక్ష, గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉండదు. ఈ AI మోడల్ మాత్రం సులభంగా ECG యంత్రాలను ఉపయోగిస్తూ హార్టు ఎలా పనిచేస్తోందో పసిగడుతుంది. దీంతో డాక్టర్లు ముందుగానే చికిత్స మొదలుపెట్టి రోగికి గణనీయమైన ఉపశమనం కలిగించగలుగుతారు.
లక్షకు పైగా ECG చిత్రాలతో ట్రెయిన్
ఈ మోడల్‌ను తయారుచేయటానికి Narayana Health బృందం లక్షకు పైగా ECG చిత్రాలను, వాటికి అనుసంధానమైన ఇకో నివేదికలను ఉపయోగించింది. దీంతో AI మోడల్ గుండె పనితీరును కచ్చితంగా అంచనా వేయగలుగుతోంది. బయటి పరీక్షలలో దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో 57,000 పైగా రోగుల డేటాతో వాలిడేషన్ చేశారు. అందులో 35% కన్నా తక్కువ EF ఉన్న (అంటే తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న) రోగులలో 97% మందిని AI గుర్తించింది. అంతేకాదు. ఈ రోగులను ఇకో పరీక్ష చేసే ముందు సగటున 58 రోజులు ముందే గుర్తించి అలర్ట్ చేసింది.
వైద్య సేవలలో వేగవంత పరిష్కారం
ఈ AI మోడల్‌ను నారాఆయణ హెల్త్ అభివృద్ధి చేసిన “ఆత్మ” అనే ఇంటర్నల్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ (EMR) సిస్టమ్‌లోకి విలీనం చేశారు. దీని వల్ల రోగుల వివరాలు నమోదు చేసిన వెంటనే గుండె పనితీరుపై అంచనా లభిస్తుంది. దీంతో వైద్యులు చికిత్స నిర్ణయాలను మరింత త్వరగా తీసుకోవచ్చు.
Detect heart failure : భారత్‌కు గర్వకారణం
ఈ ఆవిష్కరణ భారతదేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. తక్కువ ఖర్చుతో వేగంగా, కచ్చితంగా గుండె సమస్యలను ముందుగానే గుర్తించగలగడం వల్ల ఈ మోడల్ అనేక మంది ప్రాణాలను రక్షించగలదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది భారతదేశం ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేలా ఉందని, ఈ విధమైన ఆవిష్కరణలు ఆరోగ్య సంరక్షణను అందరికీ చేరువ చేయడానికి మార్గం వేస్తాయని అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.