Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెరపడింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విషయం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో నవంబర్ 20 న జరిగిన ఎన్నికలలో బిజెపి భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 132 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో బిజెపి గతంలో ఇంత పెద్ద మొత్తంలో సీట్లను గెలుచుకోవడం ఇదే మొదటిసారి బిజెపి మిత్రపక్షాలు – ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), BJP నేతృత్వంలోని మహా కూటమి మొత్తం 230 సీట్ల అధిక మెజారిటీని కలిగి ఉంది.
దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రతిపాదన
మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి సెంట్రల్ అబ్జర్వర్‌గా నియమితులైన విజయ్ రూపానీ, సీఎం పదవికి తమకు నచ్చిన పేర్లను ప్రతిపాదించాలని పార్టీ సీనియర్ నేతలను అభ్యర్థించారు. దీని తర్వాత చంద్రకాంత్ పాటిల్ దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించారు. సుధీర్ ముంగంటివార్ కూడా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో తాము చారిత్రాత్మకమైన ఎన్నికల్లో పోరాడామని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు. మహాయుతి చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రధాని మోదీ సహకారంతో మహారాష్ట్రను నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
One thought on “Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక”