Sarkar Live

Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

Dharani Portal | రాష్ట్ర వ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి ధరణి అప్లికేషన్లు భారీగా పెండింగులో ఉన్నాయి. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారాలను రాష్ట్రభుత్వం వికేంద్రీకరించింది. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టింది.ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు

Dharani

Dharani Portal | రాష్ట్ర వ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి ధరణి అప్లికేషన్లు భారీగా పెండింగులో ఉన్నాయి. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారాలను రాష్ట్రభుత్వం వికేంద్రీకరించింది. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టింది.ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గురువారం  సర్క్యులర్ జారీ చేశారు. గత మూడు రోజుల క్రితమే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నెలల తరబడి దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు.. అయితే ఈ సారైనా సీసీఎల్ఏ జారీ చేసిన ఆదేశాలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్డీవో స్థాయి:

  • టీఎం 4. అసైన్డ్ భూముల విరాసత్. పాసు బుక్ లేనప్పుడు…
  • టీఎం 27. పెండింగ్ నాలా అప్లికేషన్లు
  • టీఎం 33. డిజిటల్ సంతకం
  • జీఎల్ఎం. డిజిటల్ సంతకం

అదనపు కలెక్టర్ స్థాయి:

  • టీఎం 3. మ్యుటేషన్ దరఖాస్తులు
  • టీఎం 24. కోర్టు కేసుల ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారీ
  • టీఎం 31. పాసు పుస్తకాల జారీ. ఇల్లు, ఇంటి స్థలం అని ఉన్న చోట నాలా కన్వర్షన్ చేయడం
  • టీఎం 33. పాసు బుక్ తప్పొప్పుల సవరణ. పేరు తప్పు పడినా అదనపు కలెక్టర్ చేయవచ్చు
  • ఆర్డీవోకు పంపే దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించాలి. ఆర్డీవో కూడా పరిశీలన చేసి అదనపు కలెక్టర్ కి అప్ లోడ్ చేయాలి. వీరిద్దరి సిఫారసుల మేరకు అదనపు కలెక్టర్ చేయాలి. అయినా రిజెక్ట్ చేయాలనుకుంటే అందుకు గల కారణాలు వెల్లడించాలి

 

,

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?