Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జరిగిన దారుణ హత్య సంఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో శ్రీనిధి మార్ట్ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్కసారిగా మీదపడిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంటనే అదే అదే కారులో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దృశ్యాలన్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ఇంచార్జి సీఐ నాగేంద్రప్రసాద్ పరిశీలించారు. లోకేంద్ర తండ్రి బైరవుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
లోకేంద్ర నేర చరిత్ర
లోకేంద్రను చంపిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. కొత్తపేటలో బొప్పాయి కాయలు విక్రయించే బైరవుడు కుమారుడైన లోకేంద్ర అవివాహితుడు. గంజాయి తాగుతూ జల్సాగా తిరుగుతున్నాడు. సంవత్సరం క్రితం రైల్వే స్టేషన్‌లో రూ.15 ఆటో కిరాయి విషయంలో శ్రీనివాసులురెడ్డి అనే వృద్ధుడిని బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. 6 నెలల క్రితం ఓ మహిళను ఆటోలో తీసుకెళ్లి రేగాటిపల్లి పొలాల్లో అత్యాచారం హత్య చేసిన కేసులోనూ లోకేంద్ర ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2019లో హోంగార్డుపై దాడి చేశాడు. దీంతో లోకేంద్రపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    