Dhruva Natchathiram Release Date : రాఘవన్, ఘర్షణ, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటులకు ఉంటుంది. ప్రేమ కథలను చాలా హృద్యంగా తీయడంలో ఈయన దిట్ట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ నటుడుగా మాత్రం పలు సినిమాల్లో చేసే బిజీగా మారారు.
నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే తోనే మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సమంత ఈ మూవీ తోని వెండితెరకు పరిచయమైంది. విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ తెరకెక్కింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. దీనిపై లేటెస్ట్గా గౌతమ్ మేనన్ మాట్లాడారు. ఈ చిత్రం విడుదల కాకపోవడం నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తుందని అన్నారు. ఈ మూవీ కథను విక్రమ్ కంటే ముందు పలువురు హీరోలకు చెప్పానన్నారు. వారి వారి కారణాలవల్ల వారు చేయలేదని, కానీ హీరో సూర్య మాత్రం ఈ మూవీని చేయకపోవడం బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు.
దాదాపు 7 ఏళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ఇప్పటివరకు విడుదల కాకుండా వాయిదా పడడం అభిమానులకు కూడా నిరాశ కలిగిస్తుంది. ఇటీవల విక్రమ్ తంగలాన్ మూవీ తో వచ్చి మంచి హిట్టు కొట్టారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలయితే మంచి విజయమే సాధిస్తుంద నడంలో సందేహం లేదు.
Dhruva Natchathiram : ఏడేళ్ల క్రితమే.. చిత్రీకరణ పూర్తి..
Dhruva Natchathiram Shooting : ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న కూడా ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఇప్పటి కూడా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అటువంటి కంటెంట్ మూవీస్ కి ఆదరణ ఉంటుంది. మూవీ పాతదవుతుందా అనే అనుమానం ఇన్ని రోజులున్న ఇటీవల విశాల్ మూవీ మదగజ రాజా 12 ఏళ్ల క్రితమే విడుదల కావాల్సి ఉంది పలు కారణాలవల్ల వాయిదా పడి రీసెంట్గా విడుదలైంది. ఈ మూవీ రిజల్ట్ మనందరికీ తెలిసిందే. విశాల్ కి ఈ మధ్యలో ఒక్క హిట్టు కూడా లేదు. కానీ సుందర్ డైరెక్షన్లో వచ్చిన మదగజరాజాతో ఒక మంచి హిట్ అయితే పడింది. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఈ మూవీ విజయం సాధించడంతో మూవీ యూనిట్ హ్యాపీగా ఉన్నారు.
ఈ మూవీ రిజల్ట్ చూసి పలు వాయిదా పడ్డ చిత్రాలు కూడా రిలీజ్ కు నోచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకోవలోకి ధ్రువ నక్షత్రం కూడా వచ్చి ఒక మంచి కొడుతుందని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








