Sarkar Live

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ

Diabetes

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ రోగులు ఉన్నారు. ఈ విష‌యం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డియింది. అసంక్రమిత‌ వ్యాధుల (NCD) పోర్టల్‌ ప్రకారం 2024 నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్క‌ల‌ను అందులో ప్ర‌స్తావించింది.

జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, డ‌యాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయ‌గా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డ‌యాబెటిస్ ఉన్నట్టు స్ప‌ష్ట‌మైంది. ఇక మహారాష్ట్రలో 2.49 కోట్ల మందిని ప‌రీక్షించ‌గా 40.03 లక్షల మంది (16 శాతం) షుగ‌ర్‌ బాధితులు ఉన్నట్లు తేలింది. ఇక‌ తెలంగాణ మూడో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్‌ (13 శాతం), కర్ణాటక (12 శాతం), మధ్యప్రదేశ్‌ (11 శాతం) రాష్ట్రాలున్నాయి.

ఇక ఈశాన్యరాష్ట్రాల్లో నాగాలాండ్‌లో 32 శాతం, సిక్కింలో 25 శాతం మ‌ధుమేహ‌ వ్యాధిగ్రస్తులున్నట్లు ఎన్‌సీడీ గ‌ణంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55 శాతం కేసులతో పుదుచ్చేరి టాప్ లో నిలిచింది ఇక్కడ సుమారు లక్ష మందికి టెస్ట్ చేస్తే అందులో 55 వేల మందికి షుగర్‌ ఉన్నట్లు తేలింది. అండమాన్‌ నికోబార్‌లో కూడా 23 శాతం మంది చెక్కెర వ్యాధిగ్ర‌స్తులు ఉన్నారు.

మారిన జీవన శైలి

తెలంగాణ రాష్ట్రంలో ప‌ట్ట‌ణ జ‌నాభా ఎక్కువ‌. 42 శాతం మంది న‌గ‌రాలు, పట్టణాల్లోనే నివ‌సిస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. చాలా మంది ఇంట్లో కంటే బయటే ఎక్కువగా తింటున్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా మన హైదరాబాద్‌లోనే ఎక్కువ‌గా రెస్టారెంట్లు, హోటళ్లు మొత్తంగా 72 వేలు ఉన్నాయి. ప్ర‌జ‌ల‌ జీవనశైలిలో గ‌ణ‌నీయ మార్పులు చోటుచేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గగ‌డం.. తీసుకునే ఆహారంలో వ‌రి అన్నమే ఎక్కువ‌గా ఉండ‌డం, ప్ర‌తిరోజూ ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, మద్యపానం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. కాస్త‌ నడవడం కూడా మానేసి వాహనాలపై వెళ్లడం వంటివి తెలంగాణ‌లో షుగర్ పేషెంట్స్ పెర‌గ‌డానికి కారణ‌మ‌వుతున్నాయి.

25 ఏళ్లకే Pre-Diabetes

దేశంలో 30ఏళ్ల‌లోపే చాలా మంది డయాబెటిస్ బారిన ప‌డుతున్నారు.25 ఏళ్లకే ప్రీ-డయాబెటిస్‌ కేసులు న‌మోదువుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. శారీరక శ్రమ, వ్యాయాయం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిచేసేవారు ఎక్కువసేపు కదలకుండా కూర్చోవొద్దు. కనీసం అరగంట నుంచి గంటకు ఒకసారి లేచి అటూ ఇటూ తిరగాల‌ని చెబుతున్నారు. ప్ర‌తిరోజు వ్యాయామం చేయడం లేదా వారానికి కనీసం మూడు రోజులైనా చేయడం ఉత్త‌మం. రోజుకు ఎనిమిది గంటలపాటు.. అంతరాయం లేని నిద్ర ఆరోగ్యానికి మంచిది. మధుమేహం బారిన పడిన‌ట్లు నిర్ధారణ అయిన వెంటనే.. బరువు తగ్గగలిగితే రక్తంలో చక్కెరస్థాయులను అదుపులో ఉంచవచ్చని ఒక స్ట‌డీలో తేలింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?