తెలుగు ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ (DSP) , తమన్ (Thaman)రెండు దశాబ్దాలుగా కుర్రకారును వారి మ్యూజిక్ తో ఉర్రూతలూగిస్తున్నారు. మొదట దేవిశ్రీప్రసాద్ తో చేసిన డైరెక్టర్లు నెమ్మది గా తమన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఒకప్పుడు త్రివిక్రమ్ వరుసగా డీఎస్పీ తోనే మ్యూజిక్ చేయించుకునేవారు.
జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి,ఇలాంటి సినిమాల్లో పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ మూవీస్ హిట్టవ్వడానికి బీజీఎం కూడా ఉపయోగపడింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా భద్ర మూవీకి కూడా డీఎస్పీ నే మ్యూజిక్ అందించారు.
ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన తులసి, లెజెండ్, జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి మూవీస్ కి కూడా డీఎస్పీనే మ్యూజిక్. డీఎస్పీ దూసుకుపోతుండగా తమన్ రేసులోకి వచ్చాడు. ఇండస్ట్రీలో వరుసగా చేస్తున్న వారిని పక్కన పెట్టాల్సి వస్తే చేంజ్ అనే మాట వాడుతారు.కొత్తదనం కోసం మార్చాల్సి వచ్చింది అంటుంటారు. వీరి సినిమాలకు డిఎస్పిని పక్కనపెట్టి తమన్ తో మ్యూజిక్ చేయించుకున్నారు.
వినయ విధేయ రామకి డిఎస్పీ నే ఎంచుకున్న బోయపాటి ఆ తర్వాత బాలకృష్ణ అఖండ మూవీ నుంచి తమన్ కే మ్యూజిక్ బాధ్యతలు అప్పగించాడు. ఆ మూవీ కి బీజేఎం ఓ లెవెల్లో అదరగొట్టేసాడు. దీంతో బాలయ్య తమన్ ని వదలలేదు. వరుసగా తన సినిమాలకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు.
ఇటీవల రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ కి కూడా తమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ అదరగొట్టాడో తెలిసిందే. ఆ మూవీ సక్సె స్ మీట్ లో తమన్ (Music Director Thaman )ని బాలయ్య ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ నందమూరి తమన్ అంటున్నారని, ఇకపై ఎన్బీకే తమన్ అని స్టేజ్ పై ప్రకటించేశాడు. దీంతో బాలయ్య అభిమానులు తమ న్ ని తమ వాడిగా ఓన్ చేసుకుంటున్నారు. ఏ ప్రోగ్రాం లో అయినా ఆయనను పిలిచినప్పుడల్లా ఎన్బీ కే తమన్ అనే పిలుస్తున్నారు.
Thaman : అఖండ మూవీ నుంచి తప్పించారా?
ఇప్పుడు బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ -2 (Akhanda-2) మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ తమన్ అనే అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అఖండ-2 కి తమన్ ని పక్కన పెట్టేసి తమిళ రాక్ స్టార్ అనిరుద్ ని (Anirudh) ఈ మూవీకి తీసుకున్నట్లు ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అనిరుద్ ఈమధ్య వరుసగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న అన్ని మూవీస్ కి తనే మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో మాత్రం అక్కడ ఉన్నంత రేంజ్ సంపాదించుకోలేకపోయాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీకి దారుణమైన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవర మూవీకి మ్యూజిక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ మూవీ అంతలా హిట్టు కావడానికి సగం బలం అనిరుద్ మ్యూజికే. అంతలా బీజీయంతో ఆకట్టుకున్నాడు.
మాస్ ని ఒక ఆట ఆడుకునే బాలయ్య కు అనిరుద్ మ్యూజిక్ వాయిస్తే ఆ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ తెలుగులో అంతలా సక్సెస్ ట్రాక్ లేని అనిరుద్ ని బాలయ్య సినిమాకు దింపడం కొందరు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. బాలయ్య సినిమా అంటేనే పూనకాలు వచ్చేలా మ్యూజిక్ ఇచ్చే తమన్ ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదేమో అంటున్నారు. ఏదేమైనా బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆఖండ -2 కి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారని వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.దీనిపై మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









2 Comments
[…] చేస్తారని పేరు ఉన్న టైంలో యువ కెరటం డిఎస్పి (Devisri Prasad) దూసుకొచ్చాడు. చిరుతో మూవీ చేసే […]
[…] ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ (NTR) ఆ మూవీకి బై చెప్పి పూర్తిగా […]