One nation one Election : వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) సంచలన కామెంట్ చేశారు. జేపీసీకి బిల్లులు పంపినా పార్లమెంటులో మాత్రం ఆమోదం పొందదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు.
ఆ రెండూ ఆమోదం పొందవు
వన్ నేషన్, వన్ ఎలక్షన్ (ONOE)తోపాటు రాజ్యాంగ సవరణ చేసే బిల్లు కూడా పార్లమెంటులో దాఖలయ్యాయి. వీటిపై లోక్‌సభలో హోరాహోరీ చర్చ జరిగింది. ఈ రెండు బిల్లులను పార్లమెంటు (Parliament) సంయుక్త కమిటీ (JPC)కి పంపారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఒక ప్రశ్ననకు సమాధానంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జేపీసీ ఏర్పాటు చేశారు గానీ.. ఆ బిల్లులు ఆమోదం పొందవు అన్నారు.
బీజేపీ ఎంపీలే ఒకరిపై ఒకరు పడ్డారు..
బీజేపీ ఫిర్యాదుతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తోసివేశారని, రాహుల్ గాంధీపై భౌతిక దాడి చేశారని ఆరోపించింది. అయితే.. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై వస్తున్న ఆరోపణలు అర్థరహితమని, తోపులాట బీజేపీ (BJP) ఎంపీల మధ్యనే జరిగిందని పేర్కొన్నారు. ఒక బీజేపీ ఎంపీ, మరో బీజేపీ ఎంపీపై పడటం వల్లే ఇద్దరూ గాయపడ్డారని అన్నారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఇటీవల ఆలయ-మసీదు వివాదాలపై ఆందోళన వ్యక్తం చేయడంపై దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ‘అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత కొందరు వ్యక్తులు హిందువుల నాయకులుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం అంశాలను ప్రస్తావిస్తూ నాయకులుగా గుర్తింపు పొందాలనుకుంటున్నది మరెవరో కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే’ అన్నారు.
ఆయన ప్రకటనలకే పరిమితం
మోహన్ భగవత్ కేవలం ప్రకటనలకే పరిమితవవుతున్నారని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ముస్లింలకు అన్యాయాలు జరిగినప్పుడు మాత్రం ఆయన మౌనం వహిస్తున్నారని అన్నారు. భగవత్ ప్రకటనలు సానుకూలమైనవే అయినా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ సంస్థలను ఆయన కట్టడి చేయడం లేదని విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “One nation one Election | ఆ బిల్లు ఆమోదం పొందదు.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్”