Director Shankar : ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియన్ పేరుతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్లో సినిమా అంటే మొదట గుర్తొచ్చే పేరు డైరెక్టర్ శంకర్ (Shankar). ఖర్చుకు వెనకాడకుండా ఎన్ని కోట్లు ఖర్చు అయినా తన సినిమాలోని పాటలను అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోని ఒక పాటలో ప్రపంచంలోనే ఏడు వింతలను చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టించినా అంతకంతకు వసూల్ అయ్యేలా ఈయన సినిమాలు ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలుస్తాయి.
ఒక సినిమాకు మించి ఇంకో సినిమా భారీ హిట్ కొట్టడంతో అప్పటి బడా హీరోలు శంకర్ డైరెక్షన్ లో చాన్స్ కోసం ఎదురుచూశారు. సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా తీసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఒక శంకర్ కే సాధ్యమైంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈయన మీద నమ్మకంతో ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తుంటారు.
అయితే కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్ పై శంకర్ తన మునుపటి హవాని చూపించలేకపోతున్నారు. రోబో (Robo)తర్వాత అంతటి హిట్ ఇంతవరకు కొట్టలేకపోయారు. స్నేహితుడు, ఐ, రోబో 2, ఇండియన్ -2 (Indian-2) ఇలా వరుసగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇందులో విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan)తో తీసిన భారతీయుడు-2 మూవీకి భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు తిప్పికొట్టారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ (game changer) మూవీని తీశారు. ఈ నెల 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో వింటేజ్ శంకర్ ని కచ్చితంగా చూస్తారని చిత్ర బృందం ధీమాతో ఉంది.
బయోపిక్ పై Director Shankar కామెంట్స్..
ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బయోపిక్ ని తీయాల్సి వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajini kanth)బయోపిక్ ని తెరకెక్కిస్తానని తెలిపారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. శంకర్ కూడా రజినీకాంత్ ఫ్యాన్ అని మనకు తెలిసిందే. ఒక అభిమాని తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే ఆ మూవీ ఎంతటి హిట్టు కొడుతుందో శివాజీ, రోబో మూవీస్ తో చూపెట్టారు. అదే ఇప్పుడు సూపర్ స్టార్ బయోపిక్ తీస్తే అది ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








