JioHotstar : దేశంలోనే రెండు ప్రసిద్ధ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు విలీనమయ్యాయి. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండింటి విలీనంతో ఆన్‌లైన్ ప్రేక్షకులు జియోహాట్‌స్టార్(JioHotstar) రూపంలో మరింత ఎక్కువ కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. జియో, హాట్‌స్టార్ రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న కాంటెంట్‌ను ఒకే వేదికపై వీక్షించవచ్చు. లేటెస్ట్ సినిమాలతోపాటు స్పెషల్ షోలు, సిరీస్‌లు చూడవచ్చు. ఇతర అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చెందిన కాంటెంట్‌ను కూడా జియో హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్ కానున్నాయి.
జియోహాట్‌స్టార్‌ను ప్రారంభిస్తున్నట్లు జియోస్టార్ పేర్కొన్నది. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివరాలను సైతం వెల్లడించింది. కాగా రెండు ప్రముఖ ఫ్లాట్‌ఫామ్‌లు కలవడంతో దాదాపు మూడు లక్షల గంటల కాంటెంట్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు స్పోర్ట్స్ లైవ్ కవరేజీలు ప్రేక్షకులు వీక్షించే అవకావం కలిగింది.
JioHotstar : 50 కోట్ల మంది యూజర్లు
జియోసినిమా (Jio Cinema), హాట్ స్టార్ (Hotstar) ఓటీటీలకు చెందిన సుమారు 50 కోట్ల మంది యూజర్లు ఇప్పడు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్స్ కానున్నారు. కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన కొత్త లోగోను కూడా విడుదల చేశారు. నక్షత్రం గుర్తు ఇప్పుడు ఆ లోగోపై కనిపిస్తోంది. జియోహాట్‌స్టార్‌లోని చాలావరకు కాంటెంట్‌ను ప్రస్తుతం ఉచితంగా అందించనున్నారు. షోలు, సినిమాలు, స్పోర్ట్స్ లైవ్ చూసేందుకు ప్రస్తుతం ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మరిన్ని అపరిమిత ఫీచర్ల కోసం కొన్ని ప్లాన్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు జియోస్టార్ వెల్లడించింది. సబ్‌స్క్రైబర్స్‌కు యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ ఉంటుంది. వాళ్లకు హై రెజల్యూషన్ లో పలు రకాల వేదికలపై చూసే వీలు కలుగుతుంది.
కొత్తగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే, కనీస ప్లాన్‌ను రూ.149 నుంచి స్టార్ట్ చేశారు. ఇండియాకు చెందిన పది భాషల్లో జియోహాట్‌స్టార్ కాంటెంట్ అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..