Diwali Celebration 2025 -Eco-friendly Fireworks | దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) అమ్మకాలు, వినియోగానికి సంబంధించి గత బుధవారం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.. దేశ రాజధాని అంతటా ప్రజలు అక్టోబర్ 18 నుండి 21 వరకు ఈ బాణసంచా కాల్చవచ్చు. అంతేకాకుండా, అక్టోబర్ 18 నుండి వాయు నాణ్యత సూచికను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌సిఆర్‌లోని రాష్ట్ర పిసిబిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హర్షం వ్యక్తం చేశారు మరియు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
Diwali Celebration : అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి?
గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ బాణసంచాకు పర్యావరణపరంగా అనుకూలమైన ప్రత్యామ్నాయాలు. ఇవి వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా తయారు చేశారు. భారతదేశంలో CSIR-NEERI ద్వారా అభివృద్ధి చేసిన ఈ బాణ సంచా ముఖ్యంగా దీపావళి లేదా న్యూ ఇయర్ వేడుకల సమయంలో లేదా ఇతర ఉత్సవాల్లో వినియోగించాల్సి ఉంటుంఇ.
సాంప్రదాయ క్రాకర్ల మాదిరిగా కాకుండా, గ్రీన్ క్రాకర్లలో బేరియం నైట్రేట్, ఆర్సెనిక్ లేదా సీసం వంటి హానికరమైన రసాయనాలు ఉండవు. అవి పొటాషియం ఆధారిత సమ్మేళనాలు, తగ్గించిన అల్యూమినియం, ఇతర తక్కువ-ఉద్గార పదార్థాలు ఉండడం వల్ల సంప్రదాయ బాణ సంచాకు భిన్నంగా ఉంటాయి. SWAS మరియు SAFAL వంటి కొన్ని రకాలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నీటి ఆవిరిని కూడా విడుదల చేస్తాయి లేదా వాతావరణంలో దూళిని నిర్మూలిస్తాయి.
కాలుష్యంపై ప్రభావం
సాంప్రదాయ బాణసంచాతో పోలిస్తే గ్రీన్ క్రాకర్లు 30–50 శాతం తక్కువ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. అవి తక్కువ స్థాయిలో కణ పదార్థం (PM2.5, PM10), సల్ఫర్ డయాక్సైడ్ (SO₂), నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx) విడుదల చేస్తాయి. తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి – సాధారణంగా 125 dB కంటే తక్కువ. అయినప్పటికీ, అవి పూర్తిగా కాలుష్య రహితంగా ఉండవు. ఇప్పటికీ కార్బన్ ఉద్గారాలు, గాలి నాణ్యత క్షీణతకు దోహదం చేస్తాయి.
ఇవి పర్యావరణ అనుకూలమైవి అయినప్పటికీ, గ్రీన్ క్రాకర్లకు కూడా పరిమితులు ఉన్నాయి. అనేక ప్రాంతాలలో వాటి లభ్యత పరిమితంగా ఉంది. నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ప్రజలలో అవగాహన కూడా తక్కువగా ఉంది. “గ్రీన్” అని లేబుల్ చేయబడిన అన్ని బాణసంచా ధృవీకరించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ప్రామాణికతను నిర్ధారించడానికి QR కోడ్‌లు, CSIR ధృవీకరణ అవసరం.
గ్రీన్ క్రాకర్స్ ప్రామాణికతను ఎలా నిర్ధారించుకోవాలి
సర్టిఫికేషన్: క్రాకర్లు NEERI- సర్టిఫైడ్, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) ద్వారా ఆమోదించబడ్డాయని నిర్ధారించుకోవాలి. .
లైసెన్స్ పొందిన విక్రేతలు: నకిలీ బాణ సంచా నివారించడానికి లైసెన్స్ పొందిన రిటైలర్లు లేదా అధీకృత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి కొనుగోలు చేయండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    