Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ తగిలింది. హష్ మనీ కేసు (Hush Money Case) లో గతంలో తనను దోషిగా ఖరారు చేస్తూ గతంలో వెలువడిన తీర్పును రద్దు చేయాలని తాజాగా ఆయన చేసిన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. అధ్యక్షుడిగా ట్రంప్‌కు కల్పించే అధికారిక మినహాయింపును ఈ కేసులో ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాదులు చేసిన వాదనలను కోర్టు అంగీకరించలేదు.
కేసు ఏమిటంటే..
డోనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అక్రమంగా 1,30,000 డాలర్లు చెల్లింపులు చేశారని, దీనికి సంబంధించిన రికార్డులను ఆయన తారుమారు చేశారని ఆయనపై అభియోగం ఉంది. దీనిపై అప్పట్లో కేసు నమోదు కాగా 34 రకాల ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న యూఎస్ సుప్రీం కోర్టు ట్రంప్‌ను దోషిగా ఖరారు చేస్తూ 2023 మే నెలలో తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ న్యాయవాదులు ఆయన తరఫున కోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. డోనాల్ట్ ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడు అని, ఆయనకు అధికారిక మినహాయింపు ఇస్తూ ఈ తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించారు. దీన్ని జడ్జి జువాన్ ఎం. మెర్చన్ తిరస్కరించారు. ఈ కేసులో అధికార మినహాయింపు చట్టాన్ని పరిగణనలోకి తీసుకోలేమని తేల్చిచెప్పింది.
పోర్న్‌స్టార్‌తో శారీరక సంబంధం?
డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన హష్ మనీ కేసు అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన వివాదాస్పద కేసుల్లో ఒకటి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్‌కు 130,000 డాలర్లు ఆయన చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. స్టార్మీ డేలియల్స్‌తో ట్రంప్ శారీర సంబంధం కలిగి ఉన్నారని అప్పట్లో అభియోగం ఉంది. 2016 అధ్యక్ష ఎన్నిక సమయంలో ఇది చర్చనీయాంశమైంది. దీంతో ఖంగుతిన్న ట్రంప్ ఈ అభియోగం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారని విపక్షాల ఆరోపణ. తనతో శారీరకంగా సంబంధం లేదని ప్రకటించేందుకు డేలియల్స్‌కు ఆయన భారీ మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని అభియోగం.
జనం ఇచ్చిన డబ్బుతో..
డేలియల్స్‌కు ట్రంప్ చెల్లించిన డబ్బు ఆయన వ్యక్తిగతం కాదని, ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన నజరానా అని విపక్షాలు ఆరోపించాయి. తన వ్యవహారం బయట పడకుండా గోప్యత పాటించి అధ్యక్ష ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్ ఈ భారీ మొత్తాన్ని డేలియల్స్‌కు చెల్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ట్రంప్ ప్రచార బృందం ఈ చెల్లింపును ఆర్థిక నేరంగా పరిగణించకుండా సాధారణ చెల్లింపుగా చూపించేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
హష్ మనీ (Hush Money Case) అంటే..?
హష్ మనీ అనేది గోప్యతను కాపాడటానికి ఇచ్చే డబ్బు. స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఉన్న శారీరక సంబంధంపై ఏ సమాచారం బయటకు చెప్పకుండా ఈ చెల్లింపు జరిగిందని అప్పట్లో కేసు నమోదైంది.
ట్రంప్‌పై 34 కౌంట్ల వ్యాపార రికార్డుల ఫాల్సిఫికేషన్ ఆరోపణలు ఉన్నాయి. తనపై ఉన్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ ప్రతీకారం కోసమే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు.
దోషిగా తేల్చుతూ తీర్పు
హష్ మనీ కేసు తీర్పు 2023 మే నెలలో వెలువడింది. ట్రంప్‌ను 34 కౌంట్లపై దోషిగా తేల్చింది. ఈ చెల్లింపులు, ఆ తర్వాత వ్యాపార రికార్డుల మార్పులు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినవి అని కోర్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యాక ట్రంప్ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అధికార మినహాయింపు (Presidential Immunity)ను ఇస్తూ ఈ తీర్పును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని కోర్టు తిరస్కరించింది. హష్ మనీ చెల్లింపులు ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబంధించాయనే అంశాన్ని అధికారిక చర్యలుగా పరిగణించలేమని తీర్పు ఇచ్చింది.
Donald Trumpకు తలనొప్పిగా మారిన కేసు
ట్రంప్ 2024లో తన రెండో అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు తలనొప్పిగా మారాయి ఈ కేసు ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు, న్యాయపర చిక్కులకు కారణమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ లీగల్ టీం ఈ కేసు రద్దు చేయించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోందని సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] నమోదైన హాష్‌మనీ కేసు (Hush money case) గత ఎన్నికల నాటిది. పోర్న్ స్టార్ […]