New York : డోలాల్డ్ ట్రంప్ (Donald Trump) ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆ పీఠం ఎక్కడానికి అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. హాష్ మనీ కేసులో ఆయనకు మరోసారి చుక్కెదురైంది. శిక్ష విధింపును వాయిదా వేయాలనే అభ్యర్థనను అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దేశ అధ్యక్షుడిగా ఈ కేసులో మినహాయింపులు, వెసులుబాటు కల్పించాలని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు
న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కగా ఆయనకు మరోసారి షాక్ తగిలింది. ట్రంప్ సమర్పించిన పిటిషన్‌ను తిరస్కరిస్కరిస్తున్న ఆ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆయనకు ఎలాంటి మినహాంపులు ఉండబోమని స్పష్టం చేసింది.
పోర్న్‌స్టార్‌కు డబ్బులు ఇచ్చారని..
ట్రంప్‌పై నమోదైన హాష్‌మనీ కేసు (Hush money case) గత ఎన్నికల నాటిది. పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌కు ఆయన 130,000 డాలర్లు అక్రమంగా చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. పోర్న్ స్టార్‌తో ట్రంప్ లైంగిక సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో వాటిని కప్పి పుచ్చేందుకు ఆమెకు ఆయన ఈ మొత్తాన్ని ముట్టజెప్పారనే అభియోగాలు ఉన్నాయి. ట్రంప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రజాక్షేత్రంలో ప్రకటించేందుకు పోర్న్ స్టార్‌కు ఆయన ఈ డబ్బును చెల్లించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ నగదు ప్రభుత్వ ఖజానాకు చెందిందని, దానిని ట్రంప్ తన స్వప్రయోజనాల కోసం అక్రమంగా వాడుకున్నారని అభియోగం. దీనిపై విచారణ అనంతరం ట్రంప్‌పై అప్పట్లో కేసు నమోదైంది.
కేసు ఉండగానే అధ్యక్షుడిగా ఎన్నిక
తనపై నమోదైన కేసు నిరాధారమైనదని ట్రంప్ మొదటి నుంచే వాదిస్తున్నారు. దీనిపై ఆయన తరఫు న్యాయవాదులు ఆయా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఇటీవల అమెరికా ఎన్నికలకు ముందు అక్కడి కోర్టు ట్రంప్‌ను దోషిగా ఖరారు చేస్తూ జైలు శిక్ష విధించింది. ఇంతలోనే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Donald Trump కు మినహాయింపు ఇవ్వాలన్న న్యాయవాదులు
కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ జైలుకు వెళ్లాల్సి ఉండగా ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కనీసం శిక్ష విధింపును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
నో అన్న న్యాయమూర్తులు
ట్రంప్ (Donald Trump) తరఫు అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్డ్స్, న్యాయమూర్తి ఆమీ కోని బారెడ్, మరో ముగ్గురు లిబరల్ న్యాయమూర్తుల బెంచ్ పరిశీలించింది. ఈ కేసులో ట్రంప్‌నకు ఎలాంటి మినహాయింపులు వర్తించవని తీర్పు చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..