Donald Trump : మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంకా పవర్‌లోకి రాకముందే ఆయన చేపట్టబోయే సంచలన నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. మా ఈ క్రమంలో దేశంలో మరణశిక్షలను కఠిన నిర్ణయం అమలు చేయబోతున్నామని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. తాను అధ్యక్షుడు అయ్యాక రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుకు ఆదేశాలిస్తానని కుండబద్దలు కొట్టారు.
బైడెన్ నిర్ణయంపై Donald Trump విమర్శలు
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(Joe Biden) ఇటీవల ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40మంది ఖైదీల్లో 37మందికి జీవిత ఖైదుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణిశిక్ష తగ్గించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేయాలని న్యాయ శాఖకు ఆదేశాలు జారీ చేస్తాను. దీనివల్ల అమెరికన్ ప్రజలకు రక్షణగా ఉంటుంది.అలాగే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలను గాడిలో పెడతామని ట్రంప్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరణిశిక్షపై బైడెన్ విధించిన మారటోరియాన్ని ట్రంప్ వొచ్చాక ఎత్తివేస్తారనే ఆలోచనతోనే ఖైదీలకు మరణశిక్ష తగ్గించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది .
ముఖ్యంగా ఓ బాలికను అత్యాచారం, హత్యచేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్న పలువురు నిందితులకు కూడా మరణశిక్ష విధిస్తే.. దాన్ని బైడెన్ జీవిత ఖైదుగా మార్చారంటూ ట్రంప్ ఆగ్రహంవ్యక్తం చేశారు. అలాంటి నేరస్తులను ఏమాత్రం వదిలిపెట్టబోమని తెలిపారు. దోషులు చేసిన నేరాల గురించి తెలిస్తే… వారికి శిక్షలు తగ్గించాలని ఎవరూ అనుకోరని ట్రంప్ పేర్కొన్నారు
ఇదిలా ఉండగా 2003 నుంచి Donald Trump మొదటిసారి అధికారంలో వొచ్చేవరకు ఫెడరల్ ఖైదీలకు మరణశిక్ష అమలుచేయలేదు. కానీ ట్రంప్ వొచ్చిన 6 నెలల్లోనే 13మందికి శిక్ష అమలుచేశారు. ఆ తర్వత చివరిసారి జనవరి 16, 2021న శిక్ష విధించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Donald Trump | అలాంటి వాళ్లను వదిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష తప్పదు..”