- ప్రమాదాలకు పరోక్షంగా కారణం అవుతూనే..రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు ?
- ఉప రవాణా కమిషనర్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో టెస్ట్ ట్రాక్ లు లేకుండానే విచ్చలవిడిగా లైసెన్సులు జారీ?
- వాహనదారులు కంప్యూటర్ పరీక్ష పాస్ అవుతున్నారా? పాస్ చేస్తున్నారా?
- లైసెన్స్ లు ఎలా జారీ చేస్తున్నారో సిసి కెమెరాల్లో కనిపించడంలేదా?
DTC Hanmakonda : రోడ్డు ప్రమాదాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గదే, ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.. కానీ అసలు రోడ్డు ప్రమాదాలకు కారకులు ఎవరు? మామూళ్ల మత్తులో విచ్చలవిడిగా తమ ఇష్టారాజ్యంగా లైసెన్స్ లు (Driving License) జారీచేస్తున్న ఆర్టీఏ(RTA) లోని కొందరు అధికారులు కాదా? రోడ్డు ప్రమాదాలకు (Road Accidents)పరోక్షంగా కారణమవుతున్నవారే రోడ్డు భద్రతా మాసోత్సవాలు (National Road Safety Month) నిర్వహించడం చూస్తుంటే “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు” అన్న సామెత గుర్తుకొస్తుంది.ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది..మేము తూతుమంత్రంగా హడావిడి చేస్తున్నాము అన్నట్లుగా ఉంది ఆర్టీఏ అధికారుల తీరు. అసలు నిబంధనల ప్రకారం లైసెన్సులు జారీ చేస్తున్నారా ?లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరు అంటే 99 శాతం ఎలా పాస్ అవుతున్నారు?విచ్చలవిడిగా లైసెన్సులు జారీచేస్తే రోడ్డు ప్రమాదాలు జరగవా? రోడ్డు భద్రతా మాసోత్సవాల వేళ “సర్కార్ వెబ్ సైట్” ప్రచురిస్తున్న ప్రత్యేక కథనం..
DTC Hanmakonda కంప్యూటర్ పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణత ఎలా?
How to Pass Driving License Test : వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నిర్వహించే కంప్యూటర్ పరీక్షలో పాస్ కావాలి. పాస్ అయితే లర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు,ఆ పరీక్ష సమయం సుమారు10 నిమిషాలు ఉంటుంది అంటే ఆ 10 నిమిషాల్లో కంప్యూటర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అప్పుడే లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. ఇదంతా బాగానేఉన్నప్పటికి లర్నింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరూ అంటే 100 శాతం ఉత్తీర్ణత పొందుతున్నారు.అసలు కంప్యూటర్ పరీక్ష పాస్ అవుతున్నారా? పాస్ చేస్తున్నారా? అనే విషయం ఉపరవాణా కమిషనర్ కే తెలియాలి.
టెస్ట్ ట్రాక్ లే లేనప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఎలా నిర్వహిస్తున్నారు?
DTC Hanmakonda : ఉపరవాణా కమిషనర్ పరిధిలోని అన్ని జిల్లాల్లో ముఖ్యంగా తన కార్యాలయం ఉండే హన్మకొండ లో టెస్ట్ ట్రాక్ లేదు . కానీ రోజు డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి.అసలు టెస్ట్ ట్రాకే లేనప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఎలా నిర్వహిస్తున్నారో ఏ ప్రాతిపదికన డ్రైవింగ్ లైసెన్సులు జారీచేస్తున్నారో డిటిసి కే తెలియాలి మరి.ఇలా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగవా?మళ్ళీ మీరే రోడ్డు భద్రతా మాసోత్సవాలు అంటూ హడావిడి చేస్తున్నారా అని సామాన్యులు సెటైర్లు వేస్తున్నారు. అవినీతి కి తావులేకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం ,నిత్యం సిసి కెమెరాల్లో పరిశీలిస్తున్నాం అని చెప్పుకునే ఉపరవాణా కమిషనర్ కు లైసెన్సులు ఏ విధంగా జారీ అవుతున్నాయో కనిపించడం లేదా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..