Breaking News | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు (Earthquake) సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం, ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారం,
కరీంనగర్ విద్యానగర్‌లో భూకంపం కారణంగా నిలబడిన ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని తెలుస్తోంది .బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్‌గూడ, మోతీనగర్ లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని అక్కడి వారు చెబుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(S) మండలం పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, అమరావతి పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.20 గంటల నుంచి 7.27 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు పేర్కొంటున్నారు. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
EQ of M: 5.3, On: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, Depth: 40 Km, Location: Mulugu, Telangana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/x6FAg300H5— National Center for Seismology (@NCS_Earthquake) December 4, 2024
2 thoughts on “Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భయాందోళనలో ప్రజలు”