Sarkar Live

Electric vehicles | భార‌త్‌లో భారీగా ఈవీల విక్రయాలు.. తాజా రిపోర్ట్‌

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్

Electric vehicles

Electric vehicles : భారతదేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles (EVs) విక్రయమయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) గ‌ణాంకాలు వెల్ల‌డించింది. 11,49,334 ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e-2W) అమ్ముడయ్యాయని తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,48,561 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరుగుదల అని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (e-3W) విక్రయాలు 1,59,235 యూనిట్లకు చేరుకుని, గత సంవత్సరం 1,01,581 యూనిట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించాయ‌ని వివ‌రించింది.

గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం.. PM E-DRIVE పథకం

ఎలక్ట్రిక్ వాహన తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ‘PM E-DRIVE’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 2026 మార్చి 31 వరకు 10,900 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అలాగే, 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 వరకు అమలైన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) ఈ పథకంలో విలీన‌మైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో PM E-DRIVE కింద VAHAN పోర్టల్‌లో 10,10,101 e-2W, 1,22,982 e-3W (L5) వాహనాలు నమోద‌య్యాయి. భారతదేశంలో 10 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయమైన పురోగతిని సూచిస్తున్నాయి.

Electric vehicles : భారీ పరిశ్రమల మంత్రి ఏమ‌న్నారంటే…

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి (H.D. Kumaraswamy) ఈ విజ‌యంపై హర్షం వ్య‌క్తం చేశారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi) నాయకత్వంలో భారతదేశం స్థిరమైన రవాణా మార్గంలో ప్రగతి సాధిస్తోంది. FAME, EMPS, PM E-DRIVE వంటి పథకాల విజయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పరిశుభ్ర, పచ్చని, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ మైలురాయి కీలకం” అని పేర్కొన్నారు.

ఆటోమోటివ్ రంగంలో విప్లవాత్మక మార్పులు

భారత ఆటోమోటివ్ రంగాన్ని స్థిరమైన తయారీకి మార్చేందుకు ఉత్పాదక-అనుబంధ ప్రోత్సాహక (PLI) పథకం అమలులో ఉంది. ఈ పథకం కింద 18 ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEM) దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవాన్ని వేగవంతం చేయడంలో స్వావలంబన కలిగిన ఆటోమోటివ్ పరిశ్రమకు దోహదం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందనే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

EVs : భవిష్యత్తు దిశగా భారతదేశం

భారత ప్రభుత్వం 2070 నాటికి ‘నెట్ జీరో’ కార్బన్ ఉద్గారాలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ దిశగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ప్రభుత్వ ప్రోత్సాహం, పర్యావరణ ఆందోళనలు, సాంకేతిక పురోగతి కారణంగా వేగంగా సాగుతోంది. ఈ గణాంకాలు భారతదేశం పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉందని సూచిస్తున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!